మరో జబర్దస్త్ కమెడియన్ కి లింగమార్పిడి..

  0
  846

  జబర్దస్త్ లో నటించే కమెడియన్లలో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలుగా మారిపోయారు. లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని పూర్తి స్థాయిలో అమ్మాయిలుగా కనిపిస్తున్నారు. గతంలో వినోదిని, తన్మయ్, సాయిలేఖ, సాయి, పవన్, హరిత, శాంతి స్వరూప్, మోహన్.. వీరంతా జబర్దస్త్‌లో లేడీ గెటప్‌లు వేశారు. ఆ తర్వాత నిజంగానే లేడీస్ గా మారిపోయారు. వీరిలో ఇంకా కొందరు జబర్దస్త్ లో కంటిన్యూ చేస్తుండగా, మరికొందరు కామెడీస్టార్స్ లోకి మారిపోయారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో తన్మయ్ కూడా చేరాడు.

  ప్రియాంక సింగ్ లింగ మార్పిడి చేయింకోగా.. తాజాగా తన్మయ్ కూడా అమ్మాయిలా మారిపోయాడు. మరి ఇది ఎప్పుడు జరిగింది? ఎందుకు మారాల్సి వచ్చిందో ఇప్పుడు చూడండి. గతంలో జబర్దస్త్ సాయి లింగమార్పిడి చేసుకొని అమ్మాయిగా మారిపోయింది. ప్రియాంక సింగ్‌ ఇలా అమ్మాయిగా మారిపోయి బిగ్‌ బాస్‌ లో కూడా సందడి చేసింది.

  ఇటీవల క్యాష్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న తన్మయ్, తాను లింగమార్పిడి చేయించుకున్నట్లు తెలిపాడు. తన తల్లితో కలిసి ఆ షోలో సందడి చేసింది తన్మయిగా మారిన తన్మయ్. తన జీవితంలో ఒకే ఒక పెద్ద తప్పు చేశానని.. తన తల్లిదండ్రులకు ద్రోహం చేశానని తన్మయి చెప్పింది.

  వారు తనకు అబ్బాయిలా జన్మినిచ్చారని.. తాను ఇప్పుడు పూర్తిగా అమ్మాయిలా మారిపోయానని తన్మయి చెప్పింది. గతంలో ఎన్నో సార్లు ఆస్పత్రుల్లో చెక్ చేయించుకున్నానని.. హర్మోన్ల అసమతుల్యత వల్లే అబ్బాయి లక్షణాలు లేవని తెలిసిందని, అందుకే అమ్మాయిలా మారిపోయానని చెబుతోంది తన్మయి.