నువ్వు బాగున్నావు .. మా అన్నతో కూడా ఉండు.

  0
  507

  నువ్వు బాగున్నావు .. మా అన్నతో కూడా ఉండు.. అని భార్యను వేదించే భర్తపై కేసు పెట్టాల్సిందిగా తిరుపతి ఎస్పీ వెంకటఅప్పలనాయుడు ఆదేశించారు. అన్నతో పడక పంచుకోమని భార్యను కోరే నీచుడైన భర్త గురించి , శ్రీకాళహస్తికి చెందిన ఓ మహిళ మీతో మీ యస్.పి-స్పందన కార్యక్రమంలో తెలియజేసింది. కన్నీళ్లతో అత్తవారింట్లో కష్టాలను ఎస్పీకి ఏకరువు పెట్టింది. అత్తమామలు కూడా దారుణంగా హింసిస్తున్నారని చెప్పింది. ఆమె బాధను విన్న ఎస్పీ , తక్షణమే ఆ నీచుడైన భర్తపైన కేసు పెట్టమని శ్రీకాళహస్తి పోలీసులను ఆదేశించారు .

  ఎంతగా భర్త , అత్తా, మామల వేధింపులకు గురైందో తెలియదు గానీ… ఆమె కన్నీటి కష్టాలు విన్న యస్.పి తన భర్త తో మాట్లాడి పరిస్థితిని చక్క పెడతానని హామీ ఇచ్చినా కూడా, ఆమె నేను ఇక ఆ ఇంటిలో బతకలేను దయచేసి నాకు అతనితో విడాకులు ఇప్పించండి…. నాకు ఆ నరక కూపం నుంచి విముక్తి కలిగించండి అంటూ కన్నీళ్లతో వేడుకుంది. దీంతో ఎస్పీ ఆమె భర్త, . అత్తమామలుపై కేసు పెట్టి చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. ఆమెకు ఏసమయంలో ఆపద ఉన్నా తానున్నానని భరోసా ఇచ్చారు..

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..