కారు ఒక్క పల్టీ కొట్టి , ఎగిరి ఇలా రెండు ముక్కలైంది..

  0
  128

  కొన్ని ప్రమాదాలు చూస్తే.. ప్రయాణం అంటేనే భయమేస్తుంది. ఈ ప్రమాదం చూడండి… ఎంత ఘోరంగా ఉందో.. కారు ఏకంగా రెండు ముక్కలై.. ఒక ముక్క మూడడుగులు ముందుకు.. మరొక ముక్క నాలుగడుగులు వెనక్కి పడిపోయింది. మామూలుగా అయితే ఈకారులో ఎంతమంది ఉన్నప్పటికీ వారు బ్రతికే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే రెండు ముక్కలైన ఈ కారులో వెనకవైపున కూర్చున్న ముగ్గురు మృతి చెందారు. ముందు వైపు కూర్చున్న ఇద్దరు తీవ్ర గాయాలతో.. బ్రతికి బయటపడ్డారు..

   

  ఇంత దారుణమైన ఈ ప్రమాదం జరిగిన కారు టాటా కంపెనీకి చెందిన ఆల్ట్రోజ్.. మధ్యప్రదేశ్ లోని అనుప్పూర్ లో ఈ ప్రమాదం జరిగింది. అమితమైన వేగంతో వచ్చిన ఈ కారు.. ఒక చెట్టును ఢీకొని ఇలా రెండు ముక్కలైంది.

   

   

  మొదట డివైడర్ వద్ద కంట్రోల్ తప్పిన కారు.. చెట్టును బలంగా ఢీకొట్టి రెండుగా విడిపోయింది. అయితే ఇంత ప్రమాదం జరిగిన ఈ కారుకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండటం విశేషం. ఎంత రేటింగ్ ఉన్న కారైనా.. బ్రాండెడ్ కారైనా అతివేగంతో ప్రయాణిస్తే.. ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయనేందుకు ఇదొక ఉదాహరణ..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..