మూడు నెలల్లో 300 కోట్లు.తగ్గేదేలే..అంటున్న తిరుమల వెంకన్నా మజాకా.

    0
    214

    మూడు నెలల్లో 300 కోట్లు..
    తగ్గేదేలే.. అంటున్న తిరుమల వెంకన్నా మజాకా..!
    ==================
    మార్చి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 128 కోట్లు..
    ఏప్రిల్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 127 కోట్లు..
    మే నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్ల ప్లస్..

    తిరుమల శ్రీవారికి పూర్వ వైభవం వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. ఎప్పుడూ కళకళలాడుతుండే తిరుమల శ్రీవారి ఆలయం, కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా కళ తప్పింది. భక్తుల రద్దీ తగ్గడం, భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతించడం తదితర కారణాల కారణంగా భక్తులు కూడా శ్రీవారి దర్శనానికి వెళ్లలేక ఇళ్లలోనే ఉండిపోయారు. దీంతో గత రెండేళ్లుగా శ్రీవారి ఆదాయం కూడా భారీగా తగ్గిపోయింది.

    అయితే తాజాగా హుండీ ఆదాయం చూస్తే మాత్రం శ్రీవారికి పూర్వ వైభవం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గత మూడు నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్లకు తగ్గడం లేదు. మార్చి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 128 కోట్లు వచ్చింది. ఏప్రిల్ నెలలో కూడా శ్రీవారి హుండీ ఆదాయం 127 కోట్లు దాటేసింది. అయితే తాజాగా మే నెలలో కూడా శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్లు దాటేసినట్టు సమాచారం.. దీంతో గత మూడు నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులు సృష్టించింది.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..