షోలే’ టైటిల్ వాడారంటే.. పెనాల్టీ త‌ప్ప‌దు.

  0
  55

  షోలే’ టైటిల్ వాడారంటే.. పెనాల్టీ త‌ప్ప‌దు…
  ఢిల్లీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు…
  ======================
  షోలే.. బాలీవుడ్‌లోనే కాదు ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే మాస్ట‌ర్ పీస్. 1975లో విడుదలైన ‘షోలే’ చిత్రం అమితాబ్ బచ్చన్ కెరీర్‌లో పెద్ద విజయంగా నిలిచింది. తాజాగా ‘షోలే’ సినిమా పేరు వివాదమైంది. ఈ సినిమా టైటిల్ విష‌యంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ‘షోలే’ వంటి చిత్ర పేరును ప్రత్యేకమైనదిగా భావించి, రక్షించాల్సిన అవసరముందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

  ‘షోలే’ పేరుతో వెబ్‌సైట్‌ రూపొందించిన సంస్థ మీద‌…. ‘షోలే’ మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయ‌స్థానం వెబ్‌సైట్ రూపొందించిన సంస్థకు 25 లక్షల రూపాయ‌ల జరిమానా విధించింది. ఆ పేరుపై సర్వహక్కులు ఆ చిత్ర నిర్మాతలకే ఉంటాయని పేర్కొంది. ఎవ‌రూ వాడుకోవ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేసింది. పాపులర్ చిత్ర టైటిల్స్ ని బిజినెస్ కోసం ఎక్కడ ఉపయోగించుకోకూడ‌ద‌ని తెలిపింది. ఈ చిత్రం తప్పకుండా ట్రేడ్ మార్క్ లా కిందికి వస్తుందని ఢిల్లీ హై కోర్టు పేర్కొంది.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..