ప్రేమపేరుతో నన్ను ముంచేసింది.. చనిపోతున్నా..

  0
  640

  ప్రేమ కోస‌మై వ‌ల‌లో ప‌డినే పాపం ప‌సివాడు… ప్రేమ కోసం క‌ష్టాలు పాల‌య్యే ప్రేమికుల కోసం.. పాత‌ళ‌భైర‌వి సినిమాలో ఈ పాట… ఇప్ప‌టికీ వాడుక‌లో ఉంది. కానీ ప్రియురాలి కోరిక‌లు తీర్చ‌లేక ఓ ప్రేమికులు ఏకంగా ప్రాణాలే తీసుకున్నాడు. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని శంక‌రాపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

  చేత‌న్ అనే వ్య‌క్తి 9 ఏళ్ళుగా ఓ యువ‌తిని ప్రేమిస్తున్నాడు. సరుకు రవాణా వాహనాన్ని నడుపుతూ అతి సామాన్యంగా జీవించే చేతన్.. ప్రియురాలి సరదాలు, సంతోషం కోసం ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేశాడు. త‌న‌కు వచ్చిన జీతంలో సగ భాగాన్ని ఖర్చు చేసేవాడు. త‌న సంతోషంగా క‌న్నా.. ఆమె సంతోషమే ముఖ్య‌మ‌ని భావించిన చేత‌న్… ప్రియురాలి కోసం స‌ర్వం ధార‌పోసాడు. తీరా పెళ్ళి చేసుకోవాల‌నే ఆలోచ‌న‌తో… పెళ్ళి ప్ర‌స్తావ‌న తీసుకురాగా.. ఆమె నిరాక‌రించింది. దీంతో తీవ్రంగా మ‌న‌స్తాపం చెంది ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు చేత‌న్.

  ఆత్మ‌హ‌త్య‌కు ముందు ఓ లేఖ‌ను కూడా రాశాడు ఆ ప్రేమికుడు. ప్రేయ‌సి సంతోషం కోసం ల‌క్ష‌ల ఖ‌ర్చు చేశాన‌ని చెప్పారు. తీరా ఆమె త‌న‌ను మోసం చేసింద‌ని వాపోయాడు. తాను ఎప్పుడు ఎంత ఖ‌ర్చు చేసిందీ లెక్క రాశాడు. ఆ మొత్తాన్ని ప్రియురాలి నుండే వ‌సూలు చేసి త‌న కుటుంబానికి అంద‌చేయాల‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నాడు. చేతన్ మృతదేహం వద్ద సూసైడ్ నోట్ దొరికింద‌ని, ప్రియురాలి కోసం రూ. 4.50 లక్షలు ఖర్చు చేశానని అందులో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..