నా భార్యను నా ముందే అలాచేశారు.. హీరోయిన్ అయేషా భర్త.

  0
  188

  బాలీవుడ్ హీరోయిన్ ఆయేషా టకియాపై పట్టపగలే గోవా ఎయిర్ పోర్ట్ లో లైంగిక వేధింపులకు గురి అయిందని సాక్షాత్ ఆమె భర్త ఫర్హన్‌ అజ్మీ ఆరోపిస్తున్నాడు. బాలీవుడ్ లో హీరోయిన్ అయిన ఆయేషా , తెలుగులో కూడా సూపర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తన భార్య పట్ల గోవా ఎయిర్ పోర్టులో ఓ అధికారి చాలా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె భర్త సోషల్ మీడియాలో తెలిపాడు . సొంత దేశంలోనే పట్టపగలు ఎయిర్పోర్టులో చెకింగ్ పేరుతో తన భార్య శరీరాన్ని టచ్ చేయడం , తన కళ్ళ ముందే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

  గోవా నుంచి ముంబైకి ప్రయాణించేందుకు సిద్ధమయ్యాము. . ఆ సమయంలో ఎయిర్పోర్టులో ఏకే యాదవ్ , ఆర్పి సింగ్ అనే ఇద్దరు అధికారులు ఉన్నారు . వారిద్దరూ మమ్మల్ని చెకింగ్ కోసం లైన్లో నిలబడమన్నారు . మరో అధికారి నా భార్యను వేరే లైన్లో నిలబడమని సూచిస్తూ , ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె భర్త ఆరోపించాడు.

  తన భార్యను అలా అనవసరంగా చేయడానికి నీకు ఎంత ధైర్యం, ఆమెకు దూరంగా ఉండమని కోరాను. ఒకవేళ ఆమెను చెక్ చేయాలనుకుంటే లేడీ సెక్యూరిటీని పిలవమని అడిగాను. వినకపోగా , అసభ్యంగా కామెంట్స్ చేశారు.. సినిమా హీరోయిన్ పై పట్టపగలు జరిగిన ఈ లైంగిక వేధింపులపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఫిర్యాదు చేస్తే ఎయిర్ పోర్టు అధికారులు మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము , ఈ విషయాన్ని విచారించి తగిన చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారని చెప్పాడు..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..