ఆ ట్రైన్ డ్రైవర్ కి చెయ్యెత్తి దండం పెట్టాల్సిందే.. ముంబై కళ్యాణ్ రైల్వే స్టేషన్ వద్ద , ఓ 70 ఏళ్ళ వృద్ధుడు రైలు పట్టాలు దాటుతుండగా , పట్టు తప్పి పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో వారణాసి – ముంబయి ఎక్స్ ప్రెస్ రైలు వస్తోంది.. దూరం నుంచే వృద్ధుడిని చూసిన ట్రైన్ డ్రైవర్ , ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసి , రైలు ఆపేసాడు. సాధారణంగా వాళ్ళు ఇంత రిస్క్ తీసుకోరు. అయితే , కళ్ళముందే పెద్దాయన పట్టుతప్పి పట్టాలపై పడిపోవడం చూసి , రిస్క్ తీసుకున్నాడు. ఆ వృద్ధుడు ఇంజిన్ కిందకు పోయాడు. అయినా సహచర సిబ్బందితో కలిసి , జాగ్రత్తగా ఆ వృద్ధుడిని బయటకు తీసి సపర్యలు చేసారు. స్వల్ప గాయాలకు చికిత్స చేయించారు. రైల్వే ఉన్నతాధికారులు , సమయస్ఫూర్తితో వ్యవహరించిన లోకో సిబ్బందికి 20 వేల రూపాయలు బహుమానం ఇచ్చారు..
A senior citizen who came under a #Mumbai–#Varanasi train while crossing tracks was saved in the nick of time at #Kalyan station. #MiddayNews pic.twitter.com/tposK9x9j6
— Mid Day (@mid_day) July 18, 2021
ఇవీ చదవండి..
ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?
అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?