ఒక్క వీడియోతో ఆమె పోలీసు ఉద్యోగం ఊడింది..

  0
  1496

  టిక్ టాక్ ల పిచ్చిలో ఓ లేడీ కానిస్టేబుల్ ఉద్యోగమే వదిలేసింది. ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో కానిస్టేబుల్ ప్రియాంక మిశ్రా ఇటీవల సంచలనం సృష్టించింది. తన సర్వీస్ రివాల్వర్ ని బయటకు తీసి, సినిమా డైలాగ్ ఇమిటేట్ చేసి వార్తలకెక్కింది. పోలీస్ యూనిఫామ్ లో ఉండి, సర్వీస్ రివాల్వర్ తో ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసినందుకు అధికారులు ఆమెకు మెమో ఇచ్చారు, వీఆర్ కు పంపించారు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో జనం తిట్టిపోశారు. దీంతో ఆమె ప్రజలు తన పట్ల ఆగ్రహంతో ఉన్నారని, ఉద్యోగంలో ఉండి, ఇలాంటి వీడియోలు చేస్తున్నానని తిడుతున్నారని, అందువల్ల అసలు కానిస్టేబుల్ ఉద్యోగమే వదిలేస్తున్నానని, ఇకపై వీడియోలే చేసుకుంటానంటూ తన రాజీనామాను ఎస్పీ మునిరాజ్ కు పంపించింది.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్