ఇడుగో యతి.. అడవిలో పోతున్నాడు..

  0
  1051

  హిమాలయాల్లో యతి జాడ గురించి చాలా కథనాలే ప్రచారంలో ఉన్నాయి. అమెరికాలో కూడా అలాంటి యతి ఉంది, దానిపేరే బిగ్ ఫుట్. అతి పెద్ద పాదముద్ర ఉండటం వల్ల దాన్ని బిగ్ ఫుట్ అని పిలుస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకూ కథలే కానీ, దాని జాడ ఎవరికీ తెలియదు. అయితే తొలిసారిగా అమెరికాలోని ఇదాహో అడవుల్లో బిగ్ ఫుట్ జాడ కనపడిందని ఓ కథనం వెలువడింది.

  ఎన్ఎన్ టీవీ ఈ బిగ్ ఫుట్ కథనాన్ని ప్రసారం చేసింది. అడవిలో ఉంచిన కెమెరాల్లో దీన్ని బంధించామని చెప్పారు. బిగ్ ఫుట్ కదలికలు అన్నీ రికార్డ్ చేశామని ఆ కథనాన్ని ప్రచురించారు. అయితే దీని ఒరిజినల్ ఫుటేజీని మాత్రం అడగొద్దని ముందే క్లారిటీ ఇచ్చారు.

  ఎన్ఎన్ టీవీలో ప్రసారమైన బిగ్ ఫుట్ వీడియో అసలా, నకిలీయా అనేది ఇప్పట్లో తెలియదు కానీ.. గతంలో కూడా ఇలాంటి చాలా వీడియోలు బయటకొచ్చాయి. అయితే అవన్నీ కల్పితాలేనని తర్వాతి కాలంలో తేలింది.

  మొత్తమ్మీద బిగ్ ఫుట్ ని ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా చూశామని చెప్పేవారు ఎవరూ లేరు. చాలామంది అలా చెప్పినా, అవి కట్టుకథనాలే అని తర్వాత తేలింది. మరి ఇప్పుడీ ఎన్ఎన్ టీవీ కథనాన్ని ఎంతవరకు నమ్మాలో.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్