బిక్షగాడి అంత్యక్రియలకు వేలమంది.. ఎందుకో..?

  0
  64256

  మతిస్తిమితంలేని ఓ బిక్షగాడి అంతక్రియలకు వేలమంది హాజరయ్యారు.. తమ ఆత్మబంధువు చనిపోయినట్టు అతడికి ఘనంగా అంతిమ సంస్కారం చేశారు.. కర్ణాటకలోని బళ్లారి జిల్లా హడగళ్లీ టౌన్లో జరిగిందీ ఘటన.. ఈ మతిస్తిమితంలేని బిక్షగాడి పేరు హిచ్చ బసయ్య .. 45 ఏళ్ళు.. ఆ ఊళ్ళోనే అడుక్కుంటూ ఉంటాడు.. అయితే ఇతడి స్పెషాలిటీ ఏమిటంటే , ఒక్క రూపాయకంటే ఎక్కువ తీసుకోడు.. వందరూపాయలు ఇచ్చినా , 99 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాడు.. బలవంతం పెడితే , అసలు డబ్బులే తీసుకోడు. హడగళ్లీ టౌన్లో చాలామందికి ఒక సెంటిమెంట్ ఉంది.. ఏదైనా పనిమొదలుపెట్టేప్పుడు , బసయ్యకు , ఒక రూపాయి ఇచ్చి , పనిమొదలుపెడితే మంచి జరుగుతుందని నమ్ముతారు.. అతడు ఎక్కడున్నా , వెదికి రూపాయి ఇచ్చి , పని ప్రారంభిస్తారు.. అందరినీ అతడు , అప్పాజీ అని పిలుస్తాడు.. గుర్తు తెలియని వాహనం ఢీకొని అతడు చనిపోయాడు.. దీంతో టౌన్లో వేలమంది అతడి అంత్యక్రియలకు హాజరయ్యారు.. ఘనంగా జరిపారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.