ప్యారాచ్యూట్ తాడుతెగి సముద్రంలో పడ్డారు..

  0
  586

  ప్రమాదాలు చెప్పిరావు.. కొన్నిసార్లు భయపెట్టి గుణపాఠం చెబుతాయి.. అలాంటిదే ఇది. దయూ దీవుల్లో , ఓ జంట సముద్రంలో పారా సెయిలింగ్ చేస్తుండగా , దాదాపు 150 మీటర్ల ఎత్తులో పారాచూట్ తాడు ఊడిపోయి , దంపతులిద్దరూ సముద్రంలో పడిపోయారు. అదృష్టం బాగుండి , లైఫ్ జాకెట్ల వల్ల , సముద్రం నీళ్ళల్లో తేలుతుండగా పారా సెయిలింగ్ కంపెనీ సిబ్బంది రక్షించారు.. గుజరాత్ కు చెందిన అజిత్ , సరళ అనే దంపతులు , పారా సెయిలింగ్ కి పోయారు. సముద్రంలో ఒక బోటులో కొంత దూరం తీసుకెళ్లిన తరువాత , వారిని పారాచూట్ సాయంతో పైకి పంపారు.. ఒక తాడు సాయంతో పారాచూట్ బోటును పట్టుకునే ఉంటుంది. అయితే సడెన్ గా , తాడు తెగిపోవడంతో , దంపతులిద్దరూ సముద్రంలో పడిపోయారు.. , పారా సెయిలింగ్ కంపెనీ సిబ్బంది రక్షించారు.. తాడుతెగిన వెంటనే , ప్రాణభయంతో కేకలు పెట్టారు. అజిత్ తమ్ముడు ఇదంతా బోటులోనుంచే మొబైల్లో వీడియో తీసాడు.. ఆ వీడియోలో జరిగిన ఘోరం , కళ్లకు కట్టినట్టు ఉంది.. చూడండి.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.