తినేందుకు తరిమింది.. దండంపెడితే వదిలేసింది..

  0
  2901

  ఆవు.. పులి.. కథ మనం చిన్నప్పుడు చాలా సార్లు చదివే ఉంటాం.. ఇలాంటి సంఘటనే ఇప్పుడు నాసిక్ లోనూ జరిగింది. అయితే ఈసారి మాత్రం
  కధలో ఉండేది.. చిరుత పులి.. ఓ బుజ్జి పిల్లి..
  ఓ పిల్లిని వేటాడుతూ వచ్చిన ఓ చిరుత ప్రమాదవశాత్తూ ఓ బావిలో పడిపోయింది.. అదే బావిలో పిల్లి కూడా పడిపోయింది. అయితే అప్పటివరకూ ఆ పిల్లిని తినాలని పరుగెత్తిన చిరుత.. బావిలో పడగానే కారుణ్యం ప్రదర్శించింది. పిల్లిని చంపకుండా వదిలేసింది. ముందుగా బావిలో పడిన చిరుతకు చిర్రెత్తింది.. ఆపై వెంటనే పిల్లి కూడా బావిలో పడటంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన పంజా విసరబోయింది.. అయితే అప్పటికే తీవ్రంగా భయపడి పోయిన పిల్లి.. తనను చంపొద్దంటూ పులికి దణ్ణం పెట్టింది.. దీంతో ఆ పులిగారి మనసు వెన్నపూసలా కరిగిపోయింది. చేసేదేమీ లేక పిల్లిని చంపకుండా వదిలేసింది.. బ్రతుకుపో.. అనుకుంటూ దూరం నుంచే పిల్లిని చూస్తూ అలాగే ఉండిపోయింది. కొద్దిసేపటి అనంతరం పులి..పిల్లి బావిలో పడిన విషయం తెలిసిన ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పులిని బంధించి అడవిలో వదిలిపెట్టారు. ఆపై పిల్లిని కూడా బయటకు తీసి అక్కడే విడిచిపెట్టేశారు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్