ఇలాంటి డాక్టర్లే , నిజమైన దేవుళ్ళు..

    0
    348

    చేతులెత్తి ఎన్నిసార్లు దండం పెట్టినా ఇలాంటి మహానుభావుల రుణం తీర్చుకోలేము.. ఖర్మ భూమి అయిన మన దేశంలో దోచుకుతినే డాక్టర్లే కాదు, ఇలాంటి దైవాంశ సంభూతులైన ఇలాంటి డాక్టర్లు కూడా ఉన్నారు..అత్యున్నత స్థాయిలో ఉండి , పద్మశ్రీ అవార్డు వచ్చికూడా , ఇంత వయసులో పేదలకు ఉచితంగా సేవ చేస్తున్నాడు..

    ప్రతిభావంతుడైన ఆయన సేవల కోసమే కార్పొరేట్ ఆసుపత్రులు ఆయన ముందు నిలబడ్డా , లక్షలు ఇస్తామన్నా , ఆయన మాత్రం పేదలకే అంకితమైన గొప్ప డాక్టర్ … ఆయన పేరు డాక్టర్ తపం కుమార్ లహరి .. అమెరికాలో మెడిసిన్ చదివారు. బెనారస్ యునివర్సిటీ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేశారు.. పెళ్లి ప్రజాసేవకు అడ్డంకి అని , బ్రహ్మచారిగానే ఉండిపోయారు.

    1997 నుంచి ప్రభుత్వం ఇచ్చే జీతాన్ని , పేదలకే ఇచ్చేవారు. 2003 ఓ రిటైర్మెంట్ తరువాత వచ్చిన డబ్బు , పీఎఫ్ , ప్రస్తుతం వచ్చే పెన్షన్ అన్నింటినీ పేదల మందుల కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ కి ఇచ్చేస్తారు.. రిటైర్ అయిన తరువాత కూడా , ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు మెడికల్ కాలేజీలో పేషేంట్లను చూస్తారు..

    మళ్ళీ సాయంత్రం 4 గంటలనుంచి 7 గంటలవరకు చూస్తారు.. ఇలా 18 ఏళ్లుగా జీతం లేకుండానే , హాస్పిటల్లో రోగులను చూస్తారు. మెడికల్ కాలేజీ ఆవరణలో ఆయనకు ప్రభుత్వం వసతికోసం ఒక క్వార్టర్ మాత్రమే ఇచ్చింది.. ఇంట్లో వంట కూడా ఆయనే చేసుకుంటారు.. ఇలాంటి మహానుభావులు ఉండబట్టే , మానవత్వానికి , మంచితనానికి ఇంకా చోటు ఉంది..

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్