పిల్లల పెన్సిల్ పంచాయితీ , పోలీసు ఖాతాలోకే ..

  0
  243

  పిల్ల‌ల పెన్సిల్ దొంగ‌త‌నం, పోలీస్ స్టేష‌న్ లో పంచాయితీ…ఈ వీడియోను మన పోలీసు శాఖ తన ఖాతాలోకి వేసుకుంది. పోలీసుశాఖపై ప్రజల్లో నమ్మకానికి ఈ వీడియో నిదర్శనమని ఏపీ పోలీస్ ట్విట్టర్లో దీన్ని పోస్ట్ చేసింది. గ‌త రెండు మూడు రోజులుగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. న‌వ్వుల పువ్వులు పూయిస్తోంది. క‌ర్నూలు జిల్లా పెద్దకడుబూర్ లో బ‌డి పిల్ల‌లు పోలీస్ స్టేష‌న్ కి వెళ్ళిన ఈ ఘ‌ట‌న‌పై ఏపీ పోలీస్ శాఖ స్పందించింది. పోలీస్ స్టేష‌న్ కి వెళితే న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం చిన్న‌పిల్ల‌ల‌కు కూడా తెలుస‌న‌డానికి ఈ ఘ‌ట‌నే నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొంది. దేశంలోనే ఏపీ పోలీస్ స‌మ‌ర్ధ‌వంతంగా ప‌ని చేస్తోంద‌ని… ఫ్రెండ్లీ పోలీసింగ్ న‌డుస్తోంద‌ని స్ప‌ష్టం చేసింది. ఒక భ‌రోసా ఏపీ పోలీస్ ఇస్తోంద‌ని వెల్ల‌డించింది.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.