హీరోయిన్ సోనం కపూర్ ఇంట్లో చోరీ కేసులో..

  0
  104

  బాలీవుడ్ సినిమా హీరోయిన్ సోనం కపూర్ ఇంట్లో చోరీ కేసులో ఆ ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేస్తున్న అపర్ణ అనే యువతి ,ఆమె భర్త సాగర్ దోషులని తేలింది. సోనం కపూర్, వృద్ధాప్యంలో ఉన్న తల్లి బాగోగులు చూసుకునేందుకు అపర్ణ అనే నర్సుని కేర్ టేకర్ గా పెట్టుకున్నారు . ఆమె భర్త సాగర్, ఓ కంపెనీ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. వారం క్రితం సోనం కపూర్ ఇంట్లో రెండు కోట్ల 40 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలు నగదు చోరీకి గురయ్యాయి .

  ఈ కేసు విచారించిన పోలీసులుకి పరిస్థితి బోధపడలేదు. ఆ తర్వాత అనుమానం అపర్ణ పైకి మళ్ళింది . సీసీ టీవీ ఫుటేజ్ , అపర్ణ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు సోనంకపూర్ ఇంట్లో చోరీ చేసింది అపర్ణ, ఆమె భర్త సాగర్ అని తేలింది . దీంతో వారిద్దరిని అరెస్టు చేసి రెండు కోట్ల 40 లక్షల రూపాయలు విలువ చేసే నగలు నగదు స్వాధీనం చేసుకున్నారు. చాలా కాలంగా తమ తల్లికి దగ్గరగా ఉన్న అపర్ణ ఎంతో నమ్మకంగా ఉండేదని అయితే అదను చూసుకుని ఇంత దారుణం చేస్తుందని ఊహించలేదని సోనం కపూర్ సోదరుడు చెప్పారు.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.