వృద్ధులపైనే ఆంటీ శృంగార వల..

    0
    3715

    అమ్మాయిలైనా, ఆంటీలైనా కొత్త లవ్ స్టోరీ స్టార్ట్ చేయాలనుకుంటే కుర్రతోడు కావాలనుకుంటారు. కానీ ఆవిడ మాత్రం ముసలోళ్లకి మాత్రమే కన్నుగీటుతుంది. యువకుల జోలికే పోదు. కేవలం సీనియర్ సిటిజన్లను, అందులోనూ ఒంటరివాళ్లకు లైనేస్తుంది.
    ఆవిడ పేరు గీత. వయసు 40ఏళ్లు. ముంబైలోని మీరా రోడ్డులో ఆమె నివాసం. ఖరీదైన కార్లలో తిరిగే ఒంటరి మగాళ్లే ఆమె టార్గెట్. అందులోనూ ఆమె కేవలం వృద్ధులనే ఎంచుకుంటుంది. మెల్లగా మాట కలుపుతుంది. మాటలు కలిశాక, తాను ఒంటరినని చెబుతుంది. ఇంకేముందు ఎంచక్కా ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేద్దామంటుంది. ఈ వయసులో మనిద్దర్ని ఎవరు చూసినా అనుమానం రాదని నమ్మబలుకుతుంది.
    ఆవిడ మాటలు విని బుట్టలోపడిన పురుషపుంగవులెంతమందో నిలువుదోపిడీ సమర్పించుకున్నారు. ఊరి చివర నిర్మానుష్య ప్రాంతానికి వారి కారులోనే వెళ్లేది. అక్కడ బట్టలు విప్పించి శృంగారానికి రెచ్చగొట్టేది. ముసలి మన్మథులు బట్టలు విప్పి నగ్నంగా తయారైన తర్వాత తన అసలు స్వరూపం బయటపెట్టేది. బంగారు గొలుసులు, పర్సు లాక్కునేది. అక్కడ్నుంచి మెల్లగా పరారయ్యేది. ఇంట్లో తెలిస్తే పరువు తక్కువ, పోలీస్ కేసు పెడతామంటే.. సవాలక్ష ప్రశ్నలు అడుగుతారు. అందుకే చాలామంది ఆమె వ్యవహారం బయటకు చెప్పకుండా తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయేవారు. గతవారం చార్ కోప్ ప్రాంతానికి చెందిన 70ఏళ్ల వృద్ధుడిని కూడా ఇలాగే మోసం చేసే సరికి అతను పోలీస్ కేసు పెట్టాడు.
    అతను చెప్పిన స్టోరీ ఇది..
    ” నేను నా రిటైర్మెంట్ డబ్బులు బ్యాంకునుంచి తీసుకుని ఇంటికెళ్తున్నాను. గీతా పాటిల్‌ నా దగ్గరకు వచ్చి ఏడవటం మొదలుపెట్టింది. ఎందుకని అడిగాను. తన భర్త టార్చర్‌ చేస్తున్నాడని చెప్పింది. నేను సానుభూతి వ్యక్తంచేశాను. సెక్స్‌ విషయంలోనూ భర్త ఆమెపై ఆసక్తి కనబర్చటం లేదని అంది. నన్ను తనతో ఏకాంతంగా గడపమంది. నేను, ఆమెతో కలిసి ఆటో రిక్షాలో ఊరి బయటి నిర్మాణంలో ఉన్న భవనం దగ్గరకు వెళ్లాము. అక్కడ ఆమె నాపై దాడి చేసి, బంగారు చైను, నగదు దోచుకుంది. నేను ఎదురు తిరిగితే అత్యచారం చేస్తున్నావని అరుస్తానని భయపెట్టింది” అంటూ పోలీసులకు నిజం చెప్పేశాడు ఆ వృద్ధుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమెపై దాదాపు 14 కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.