కారవాన్… ఇప్పుడు ఇది స్టేటస్ సింబల్. సెలబ్రిటీలు, బిజినెస్ టైకూన్స్, పొలిటికల్ లీడర్స్, స్టార్ హీరోలు వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. రోడ్డు మీద కారవాన్ కనిపిస్తే… అది వెళ్ళేవరకు చూపు తిప్పుకోనివ్వని లగ్జిరీ వెహికల్స్ ఇవి. అందుకే కోట్లు ఖర్చు పెట్టి మరీ… వీటిని తమకు అభిరుచులకు అనుగుణంగా తయారు చేసుకుంటూ ఉంటారు బడాబాబులు.
అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ సరికొత్తగా రూపొందించిన కారవాన్ .. మిగతా వాటికంటే కాస్త అడ్వాన్స్ లో ఉంది. ఇక దీని విషయానికి వస్తే చిన్న సైజ్ ఫైవ్ స్టార్ హోటల్ ని తలపిస్తుంది. అడుగడుగునా రిచ్ నెస్ ఉట్టిపడేలా ఇంటీరియర్స్, వరల్డ్ క్లాస్ మెటీరియల్ తో తయారైన ఫర్నీచర్, లేటెస్ట్ ఎలక్ట్రానిక్ గూడ్స్, ఉపకరణాలు అన్నీ ఈ స్టయిలిష్ కారవాన్ లో ఉంటాయి.
రూఫ్ టాప్, రిక్లెయినర్ సీటింగ్, కిచన్, ఫ్రిజ్, వాష్ రూమ్, బెడ్ రూమ్, లివింగ్ రూమ్ అన్నీ హంగులూ దీని సొంతం. ఇక సోలార్ ప్యానల్ వినియోగిస్తే 400 వాట్స్ కరెంట్ సప్లయ్ కూడా వస్తుంది.
ఇందులో స్పెషల్ ఏంటంటే.. ఎక్కడికైనా దూరప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అడవులు, ఎడారుల వంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తాత్కాలిక షెల్టర్ షెడ్ ను అమర్చుకునే సౌకర్యం కూడా ఈ కారవాన్ సొంతం. అత్యాధునిక వసతులతో నడిచే ఈ కారవాన్ ఇంద్రభవనంలా అనిపిస్తుందనడం అతిశయోక్తి కాదు.