చ‌నిపోయిన కుక్క‌కి పాల‌రాతి విగ్ర‌హం రోజూ పూజ.

  0
  143

  మనిషికి నమ్మకంగా ఉండే నేస్తం శునకం. అన్నివేళలా క‌ని పెట్టుకుని ఉంటుందీ మూగ‌జీవం. త‌న‌తో 11 ఏళ్ళు స‌హ‌వాసం చేసి చ‌నిపోయిన కుక్క‌కి ఏకంగా పాల‌రాతితోనే విగ్ర‌హం చేయించి పూజాదికార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాడు ఓ య‌జ‌మాని. త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.శివ‌గంగ స‌మీపంలోని బ్రాహ్మ‌ణ‌కురిచ్చిలో 82 ముత్తు అనే వ్య‌క్తి వ‌ద్ద ఓ కుక్క ఉండేది. లాబ్ర‌డ‌ర్ జాతికి చెందిన ఈ కుక్క‌కి టామ్ అనే పేరు పెట్టుకుని ప్రేమ‌గా చూసుకున్నాడు.

  11 ఏళ్ళ పాటు ముత్తు వ‌ద్ద‌నే ఉంటూ.. అత‌నితో మెలిగింది. గ‌తేడాది ఈ కుక్క మ‌ర‌ణించింది. అయినా స‌రే.. ముత్తు మాత్రం త‌ను ప్రేమ‌గా పెంచుకున్న శున‌కాన్ని మ‌ర్చిపోలేదు.త‌న వ్య‌వ‌సాయ పొలంలో పాల‌రాతితో విగ్ర‌హం త‌యారు చేయించాడు. రోజూ పూల‌మాల వేసి పూజ చేస్తాడు. ఆ కుక్క‌కి ఇష్ట‌మైన ఆహారాన్ని ప్ర‌తిరోజూ నైవేద్యంగా పెడుతుంటాడు. ఆ ఆహారాన్ని ఇత‌ర కుక్క‌ల‌కు వేస్తుంటాడు. ఏడాది కాలంగా ఆ వృద్దుడు ఆ కుక్క మీద ఉన్న ప్రేమ‌ను చాటుకుంటున్నాడు.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.