హార్లేడేవిడ్సన్ 338ఆర్ బైక్
అమెరికా లగ్జరీ మోటార్ బైక్ దిగ్గజం హార్లే డేవిడ్‌సన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బైక్ స్పెషాలిటీ ఏంటో బైకర్లందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడో కొత్త విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ ధరలో హార్లే డేవిడ్సన్ బైక్ అందుబాటులోకి రానుంది.
ఇందుకోసం చైన్ ఆటో దిగ్గజం కియాన్ జియాంగ్ గ్రూప్ తో హార్లే డేవిడ్‌సన్ భాగస్వామ్యమైంది. భారత్ మార్కెట్‌ను దృష్టిలో, మరీ ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఈ తరహా బైక్ లను రూపొందిస్తోంది. రాయల్ ఎన్ ఫీల్డ్ లకు పోటీగా దీన్ని ఆవిష్కరించబోతోంది.
హార్లే డేవిడ్‌సన్ 338R గా ఈ బైక్‌కి నామకరణం చేశారు. ఈ మోడల్ ని 2023లో భారత్ మార్కెట్ లోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. 500 సీసీ, 6 గేర్స్, టియర్ డ్రాప్ షేప్ ట్యాంకర్, ఫ్రంట్ సస్పెన్షన్, రేడియల్ బ్రేక్ కాలిపర్‌లు స్వింగ్ ఆర్మ్, అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్స్ ను ఇది కలిగి ఉంటుంది.