మార్చి నెలలో ఎండలు 121 ఏళ్లలో రికార్డ్.. మరి రాబోయే ఎండలో..??

    0
    159

    వాతావరణ సమతుల్యం దెబ్బతింటున్న ప్రభావం క్రమంగా , మానవాళిపై పడుతుందన్న నిజం క్రమంగా అనుభవంలోకి వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోవడమే ఇందుకు నిదర్శనం.. ఈ ఏడాది మార్చి నెలలో ఎండలు , 121 ఏళ్లలో లేవని , భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మార్చి నెలలో ఇంత ఉష్ణోగ్రతలు 1901 సంవత్సరంలో వచ్చాయని , మళ్ళీ ఈ ఏడాది మార్చిలో అది పునరావృతం అయిందని చెప్పారు.

    దేశంలో అనేక రాష్ట్రాలలో , 121 ఏళ్లలో మార్చి నెల ఉష్ణోగ్రతల సగటులో 3 . 86 డిగ్రీల పెరుగుదల కనిపించింది. మార్చి నెలలో రెండు తీవ్రమైన వడగాడ్పులు రికార్డ్ అయ్యాయి. తెలంగాణాలో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం , ప్రజలను మధ్యాహ్నం 12 నుంచి , సాయంత్రం 4 వరకు బయటతిరగొద్దని సూచన చేసింది.

    పడమర గాలులు వల్ల వడగాడ్పులు , మేఘాలు లేని ఆకాశం కారణంగా సూర్యతాపం నేరుగా భూమిని తాకడం, దేశంలోని వాయువ్య ప్రాంతాలలో సరైన వర్షాలు పడకపోవడం దీనికి కారణాలని , ఐఎండీ పూనా డైరెక్టర్ చెప్పారు..ఈ ఏడాది జూన్ నెలవరకు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ వడగాడ్పులు కూడా వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి..

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.