మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతకు చేరుతాయి..??

    0
    203

    దేశంలో లో పెట్రోల్ , డీజిల్ ధరలు టీవీలో డైలీ సీరియల్స్ లాగా ఏరోజుకారోజు పెరిగిపోతూనే ఉన్నాయి . గత పది రోజుల్లో ఒకరోజు విరామం తప్ప పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో కేంద్రం ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ప్రజల నుంచి వ్యతిరేకతను వస్తున్న వ్యతిరేకతను పట్టించుకోకుండా పెట్రోల్ , డీజిల్ దరల పెంపులో రికార్డ్ సృష్టిస్తోంది. చివరకు ఉగాది కానుకగా శనివారం నాటికి పెట్రోల్ ధర లీటర్ 119 కి చేరుకుంది. డీజిల్ ధర 102 రూపాయలకు చేరింది. ఉత్తర ప్రదేశ్ , గోవా, ఉత్తరాఖండ్ ,పంజాబ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడంలేదని చెప్పి నాటకమాడిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికల అయిపోయి ఫలితాలు వెలువడిన తర్వాత తన ప్రతాపాన్ని చూపించి ప్రజలను అధిక ధరలతో బాధేస్తోంది.

    తాజాగా ఉగాది కానుకగా ఈ రోజు కూడా పెట్రోల్ ధరలు పెంచేసింది పెట్రోల్ పై 90పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు .. దీంతో హైదరాబాదు లో పెట్రోల్ ధర.116.32, డీజిల్‌ ధర రూ.102.45కు చేరింది..ఆంధ్రలో అయితే 117 రూపాయల నుంచి నుంచి 119 రూపాయలకు వివిధ జిల్లాల్లో ధరలు వివిధ రకాలుగా ఉన్నాయి .. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 102. 61 రూపాయలు, డీజిల్ ధర 93. 87 రూపాయలుగా ఉంది విచిత్రం ఏంటంటే మన పొరుగు దేశాల్లో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఉన్నా అక్కడ లీటర్ పెట్రోల్ ధర మన కరెన్సీలో 66 రూపాయల 79 పైసలు , ఇది శ్రీలంక కరెన్సీలో 250 శ్రీలంక రూపాయలకు సమానం..

    అయితే ఇక్కడ తలాతోకా తెలియని మీడియా , శ్రీలంకలో కరెన్సీతో పోల్చి రేట్లు చెప్పి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో పెట్రోల్ ధర 66 రూపాయల 99 పైసలు , పాకిస్తాన్ లో పెట్రోల్ ధర 62 రూపాయల 38 పైసలు, బంగ్లాదేశ్లో పెట్రోల్ ధర 78 రూపాయలు యాభై మూడు పైసలు, భూటాన్లో పెట్రోల్ ధర 86 రూపాయల 28 పైసలు , నేపాల్ లో పెట్రోల్ ధర 97 రూపాయల ఐదు పైసలు ఉంటే భారతదేశంలో మాత్రం సరాసరి నూట పదిహేడు రూపాయల నుంచి 119 రూపాయలు లీటర్ పెట్రోల్ ధర పలుకుతోంది..

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.