బైక్ రేసులో పట్టుబడితే ఇక అక్కడే.. అదే శిక్ష.

    0
    251

    బైక్ రేసులకు పోతారా ..?? బైకులమీద స్టంట్ చేస్తారా.. ?? మద్రాస్ హైకోర్టు తీర్పు చూస్తే , బైక్ రేసులు పిచ్చోళ్ళు అయిన కుర్రాళ్ళు ఆలోచనలో పడతారు.. చెన్నైలో కొరుక్కుపేట కు చెందిన ప్రవీణ్ అనే యువకుడు బైక్ రేసులో పోలీసులకు చిక్కిపోయాడు. అతడిని అరెస్ట్ చేసి కేసుపెట్టారు. హైకోర్టులో అతడికి బెయిల్ కోసం పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ని విచారించిన కోర్టు , ప్రవీణ్ కి , కొత్తరకం శిక్ష వేసింది.

    స్టాన్లీ హాస్పిటల్లో , నెల రోజులు వార్డు బాయి గా పని చేయమని ఆదేశించింది. బైకు రేసులు వల్ల చాలామంది యాక్సిడెంట్ లలో గాయాలు పాలవుతున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బైక్ రేసుల్లో చిక్కిన యువకులను , హాస్పిటల్స్ యాక్సిడెంట్ వార్డుల్లో పనిచేయమంటే , కనీసం వాళ్లకు గాయాలు తగిలిన వాళ్ళను చూసైనా బుద్ధివస్తుందని భావిస్తున్నామన్నారు.. నెల రోజులు వార్డు బాయిగా పనిచేసి వస్తే , బెయిల్ విషయం ఆలోచిస్తామని అన్నారు..

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో