పంటపొలాల్లో విమానం క్రాష్ ల్యాండింగ్..
గుక్కపెట్టి ఏడ్చిన స్టార్ హీరోలు.. సరిగ్గా 28 ఏళ్ల క్రితం..
==========================
సరిగ్గా 28 ఏళ్ల క్రితం నెల్లూరు జిల్లా వెంకటగిరి పంటపొలాల్లో ఓ విమానం దిగింది. అప్పటి వరకూ ఆకాశంలో విహరించిన ఆ విమానం, ఉన్నట్టుండి వెంకటగిరి పొలాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో పంటపొలాల్లో పనులు చేసుకుంటున్న వారంతా షాకయ్యారు. అలా చూస్తుండగానే ఆ విమానం పంటపొలాల్లో దిగిపోయింది. దీంతో పంట పొలాల్లో పనిచేస్తున్న వారంతా షాకయ్యారు. పంటపొలాల్లో విమానం దిగే సమయంలో అందులో ప్రయాణిస్తున్న వారంతా గుండెలు అరచేతిలో పట్టుకొని.. దేవుణ్ణి ప్రార్ధించారు. ఆ విమానంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, విజయశాంతి, అల్లు రామలింగయ్య తదితర సెలెబ్రిటీలు కూడా ఉన్నారు.
అసలు ఆరోజు ఏం జరిగింది..?
అది 1993. నవంబర్ 15వ తేదీ.. మద్రాస్ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్ళవలసిన విమానం.. 247 మంది ప్రయాణీకులతో విమానం మామూలుగానే బయలుదేరింది. అయితే తమిళనాడు రాష్ట్రం దాటి.. ఏపీ సరిహద్దుల్లోకి రాగానే పైలట్ కెప్టెన్ బల్లా కు ఫ్యూయల్ అయిపోయిందంటూ సంకేతం వచ్చింది. దీంతో పైలట్ ఆశ్చర్యపోయాడు. విమానాన్ని వెనక్కు మళ్లిద్దామంటే, సరిపడా ఇంధనం కూడా విమానంలో లేదు. దీంతో పైలట్ నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా విమానాన్ని కిందకి దించాలని అనుకున్నాడు. అనువైన ప్రాంతం కోసం చూస్తూ ఆలోచిస్తున్నాడు. వెంకటగిరి ప్రాంతంలో పొలాల్లో దించాలనుకుని.. నిర్ణయం తీసుకొని.. నిమిషాల వ్యవధిలో విమానాన్ని కిందకు దించేశాడు.
విమానం కిందకు దిగగానే, అందులోని ప్రయాణీకులను విమానం నుంచి క్షేమంగా దించేశారు. కిందకు దిగిన సినీనటులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మొదలగు హీరోలంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఒకరినొకరు హత్తుకొని ప్రాణాలు దక్కాయని, పైలట్ భళ్ళాకు కృతజ్ఞతలు చెప్పారు. అప్పటికే పంటపొలాల్లో విమానం దిగిందన్న విషయం తెలుసుకున్న సమీప ప్రాంతాల్లోని ప్రజలందరూ, సంఘటనా స్థలానికి భారీగా తరలివచ్చారు. తమ అభిమాన తారలు క్షేమంగా ఉన్నారని తెలుసుకుని, ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదం జరిగిన తరువాత కొద్దిరోజులకు, టాలీవుడ్ ప్రముఖులను క్షేమంగా తీసుకొచ్చిన కెప్టెన్ భళ్ళాను సినీ ప్రముఖులు సత్కరించారు. ఈ విషయంపై సదరు ఎయిర్ లైన్స్ కెప్టెన్ భళ్ళాను విధులనుంచి తొలగించింది.