రాబోయే మూడు రోజులు భారీ వర్షాల భయం..

    0
    12555

    దక్షిణ అండమాన్ లో ఏర్పడ్డ అల్పపీడనం , క్రమంగా ఉత్తర అండమాన్ సముద్రంలోకి మళ్లింది.. ఇదే ఇప్పుడు మన రాష్ట్రంలో మరో ఉపద్రవానికి కారణం కాబోతుంది.. సోమవారం నాటికీ ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించిన అల్పపీడనం బలపడి , తీవ్ర రూపం దాల్చింది. ఇది తూర్పు , మధ్య ఆగ్నేయ బంగాళాఖాతం లోకి ప్రవేశించే క్రమంలో 16 తేది రాత్రి , లేదా 17 వ తేది ఉదయం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు బలంగా ఉన్నాయి.. ఇది 18 వ తేదీకల్లా , దక్షిణ కోస్తాలో తీరం దాటే అవకాశం ఉంది.

    దీని ప్రభావంతో నెల్లూరు , ప్రకాశం , గుంటూరు, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి , అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు.. తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధనాకేంద్రం ఆదివారం ప్రకటించింది. వచ్చే 48 గంటల్లో చెన్నై నగరం మేఘావృతమై ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉంది.

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.