ఎడమచేయి లాగుతుందన్న కేసీఆర్.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?

  0
  224

  తెలంగాణ ముఖ్యమంత్రి సడన్ గా ఆస్పత్రిపాలయ్యారు. వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్‌ కు గుండె, యాంజియో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎంవో కార్యాలయం వెల్లడించింది. అస్వస్థత వల్ల ఈరోజు యాదాద్రి పర్యటనను కూడా సీఎం రద్దు చేసుకున్నారు. కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, మనవడు హిమాన్షు, ఎంపీ సంతోష్‌ ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్విట్టర్ లో పెట్టిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

  కేసీఆర్‌ ఎడమ చేయి లాగుతున్నట్లు చెప్పారని యశోద ఆస్పత్రి వైద్యుడు డా.ఎంవీ రావు తెలిపారు. ప్రాథమిక పరీక్షల అనంతరం యాంజియోగ్రామ్‌ నిర్వహించినట్లు వెల్లడించారు. సాధారణ చెకప్‌లో భాగంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..