బెలూన్ అమ్మే అమ్మాయి.. మోడల్ కాబోతుందా..?

  0
  66

  సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఇవాళ రేపు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయిన వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అంత‌కుముందు రైల్వేస్టేష‌న్ లో పాట‌లు పాడుకుంటున్న యాచ‌కురాలు రాణు మెండాల్ ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది. నిన్న‌టికి నిన్న కేరళ కోజికోడ్ కు చెందిన 60 ఏళ్ల మమ్మిక్కా అనే కూలీ ఓవర్ నైట్ లో సెల‌బ్రిటీ అయిపోయాడు. ఇప్పుడు కిస్బూ అనే యువ‌తి కూడా అంతే. మీడియా మొత్తం ఆమె వైపు చూస్తోంది. ఒక్క‌రోజులోనే స్టార్ అయిపోయింది.

  రాజ‌స్థానీకి చెందిన కిస్బూ కేర‌ళ‌లో రోడ్ ట్రాఫిక్ సిగ్న‌ల్ వ‌ద్ద బెలూన్లు అమ్ముతూ జీవిస్తోంది. ఇలాంటి సాదాసీదా జీవితాన్ని అనుభ‌విస్తోన్న కిస్బూ… అండలూర్‌ కవూ జాతరకు బుగ్గలు అమ్మడానికి వెళ్లింది. అక్క‌డి నుంచే ఆమె జీవితం మలుపు తిరిగింది. కిస్బూ బెలూన్లు అమ్ముతూ ఫోటో గ్రాఫ‌ర్ అయిన అర్జున్ కృష్ణ‌న్ కెమెరా కంటికి చిక్కింది.

  అంతే ఆయ‌న త‌న కెమెరాలో ఆమెను బంధించి.. ఆ ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. అంతే.. ఒక్క‌సారిగా ఆమెకు లైక్స్ వ‌ర‌ద పారింది. ఆ త‌ర్వాత ఆమెతో కొన్ని ఫోటోషూట్లు చేయించాడు. వాటిని కూడా పోస్ట్ చేయ‌డంతో… ఆమె ద‌శ తిరిగిపోయింది. ఎక్క‌డ‌లేని ఫాలోయింగ్ వ‌చ్చేసింది. వ‌న్ నైట్‌లోనే ఆమె సెల‌బ్రిటీ అయిపోయింది. ఇంకేముందు వివిధ కంపెనీలు, ర‌క‌ర‌కాల బ్రాండ్స్ ఆమెకు అవ‌కాశాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. అదృష్ట‌మంటే కిస్బూదే.

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..