కేసీఆర్ ఆరోగ్యంపై ఇన్ని పుకార్లెందుకు..?

  0
  110

  కేసీఆర్ ఆరోగ్యం సడన్ గా బాగోలేదు, ఆయన ఆస్పత్రికి వెళ్లారు అనే సరికి ఒక్కసారిగా పుకార్లు షికార్లు చేశాయి. అసలు కేసీఆర్ కి ఏమైంది. ఎందుకు బాగోలేదు, ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని అందరూ వాకబు చేశారు. చివరకు ఆయనకు ఏ సమస్యా లేదని వైద్యులు తేల్చి చెప్పారు. కేసీఆర్ కు ఎలాంటి గుండె సంబంధిత స‌మ‌స్య‌లు లేవ‌ని య‌శోద ఆస్ప‌త్రి వైద్యులు ఫిజిషీయ‌న్ ఎంవీ రావు, కార్డియాల‌జిస్ట్ ప్ర‌మోద్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

  ప‌లు ర‌కాల వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం కేసీఆర్‌కు స‌ర్వైక‌ల్ స్పాండిలోసిస్ అని నిర్ధారించామ‌ని వారు పేర్కొన్నారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రికి సూచించామ‌ని వైద్యులు తెలిపారు.

  కేసీఆర్‌కు వైద్య ప‌రీక్ష‌లు ముగిసిన అనంత‌రం య‌శోద వైద్యులు మీడియాతో మాట్లాడారు. గ‌త రెండు రోజుల నుంచి వీక్‌గా ఉన్నాన‌ని తెలిపిన‌ట్లు డాక్ట‌ర్ విషు రెడ్డి పేర్కొన్నారు. ఎడ‌మ చేయి నొప్పిగా ఉంద‌ని చెప్పారు. హాస్పిట‌ల్‌కు వ‌చ్చి ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించాం. దీంతో కేసీఆర్ య‌శోద‌కు వ‌చ్చారు. ఫిజిషీయ‌న్ డాక్ట‌ర్ ఎంవీ రావు, కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ ప్ర‌మోద్ రావు క‌లిసి కేసీఆర్‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారని డాక్ట‌ర్ విషు రెడ్డి (చీఫ్ ఆఫ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్, య‌శోద హాస్పిట‌ల్ ) తెలిపారు.

  గ‌త రెండు రోజుల నుంచి అల‌స‌ట‌గా ఉన్న‌ట్లు మాకు చెప్పారు. ఇవాళ ఉద‌యం ఎడ‌మ చేయి నొప్పిగా ఉంద‌ని చెప్తే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లి ప‌రిశీలించాం. మా సూచ‌న మేర‌కు ఆస్ప‌త్రికి వ‌చ్చి వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. యాంజియోగ్రామ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. ఎలాంటి బ్లాక్స్ లేవ‌ని తేలింది. ప్ర‌స్తుతం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే ఈసీజీ, 2డీ ఎకో ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించాం. హార్ట్ ఫంక్ష‌న్ కూడా బాగుంది. హార్ట్‌కు సంబంధించిన ర‌క్త ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించాం. ఆ రిపోర్ట్స్ కూడా నార్మ‌ల్‌గానే ఉన్నాయి. గుండెకు సంబంధించి ఎలాంటి స‌మ‌స్య లేక‌పోవ‌డంతో.. ఎడ‌మ చేయి నొప్పి ఎందుకు వ‌చ్చింద‌నే విష‌యం తెలుసుకునేందుకు మెడ‌కు, బ్రెయిన్‌కు సంబంధించి ఎంఆర్ఐ టెస్టులు కూడా చేశాం. – కార్డియాల‌జిస్ట్ ప్ర‌మోద్ కుమార్

  కేసీఆర్ ఉద‌యం 8 గంట‌ల‌కు ఫోన్ చేసి నీర‌సంగా ఉంద‌ని తెలిపారు. ఎడ‌మ చేయి లాగుతుంద‌ని చెప్పారు. దీంతో నేను, ప్ర‌మోద్ రావు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లి కేసీఆర్ ఆరోగ్య వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నాం. ప్రివెంటివ్ చెక‌ప్‌లో భాగంగా ఆస్ప‌త్రికి వ‌చ్చి ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించాం. యాంజియోగ్రామ్ ప‌రీక్ష‌ల త‌ర్వాత బ్రెయిన్, స్పైన్‌కు సంబంధించి ఎంఆర్ఐ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. అదృష్ట‌వ‌శాత్తు కేసీఆర్‌కు ఎలాంటి కార్డియో ప్రాబ్లం లేదు. ఎంఆర్ఐ బ్రెయిన్ రిపోర్టు కూడా నార్మ‌ల్‌గానే ఉంది. ఎంఆర్ఐ స‌ర్వైక‌ల్ స్పైన్‌లో కొంచెం స్పాండిలోసిస్ ఉంది. ఇది వ‌య‌సుతో పాటు వ‌స్తుంది. కేసీఆర్ ఎక్కువ‌గా వార్తా ప‌త్రిక‌లు చ‌దువుతుంటారు. ఐ పాడ్ కూడా చూస్తుంటారు.. దీంతో మెడ నొప్పి కార‌ణంగా ఎడ‌మ చేయిలో నొప్పి వ‌చ్చింది. అన్ని ర‌కాల ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. అన్ని బాగానే ఉన్నాయి. బీపీ, షుగ‌ర్ కంట్రోల్‌లోనే ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్నారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించాం. ప్ర‌తి ఏడాది కేసీఆర్‌కు ప్రివెంటివ్ చెక‌ప్ చేస్తామ‌న్నారు. కేసీఆర్‌ను సాయంత్రం 3 – 4 గంట‌ల మ‌ధ్య‌లో డిశ్చార్జి చేస్తామ‌న్నారు. – ఫిజిషీయ‌న్ ఎంవీ రావు

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..