ఫేవరేట్ హీరో కోసం ఏమైనా చేస్తుంటారు ఫ్యాన్స్. ఇక అమ్మాయిలతే తమ కలల రాకుమారుడని ఫిక్స్ అయిపోతారు. చాన్స్ ఉంటే ఆ హీరోనే పెళ్ళి చేసుకోవాలని కలలు కంటారు. అలాంటి ఓ లేడీ ఫ్యాన్.. తన అభిమాన హీరోకి భారీ ప్రపోజల్ పెట్టింది. తనను పెళ్ళి చేసుకుంటే ఎదురు 20 కోట్లు ఇస్తానంటూ ఆఫర్ చేసింది. ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా ?
అతనే బాలీవుడ్ యంగ్ హీరో కార్యక్ ఆర్యన్. 31 ఏళ్ళ ఈ యువహీరోకి బాలీవుడ్ లో అవకాశాల జోరు పెరిగింది. అందులోనూ అమ్మాయిలకు యమక్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ హ్యాండ్సమ్ హీరోని పెళ్ళి చేసుకునేందుకు ఓ లేడీ ఫ్యాన్ .. తనను పెళ్ళి చేసుకుంటే 20 కోట్లు ఇస్తానని సోషల్ మీడియా వేదికగా ఆఫర్ చేసింది. దీంతో కార్తీక్ కూడా ఎప్పుడు అంటూ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చాడు. ఇది కాస్త వైరల్ కావడంతో… తనపై బిడ్డింగ్ మొదలైందంటూ కార్తీక్ చెప్పుకొచ్చాడు.