వలీ , గురిచూసి కొడితే పుతిన్ కైనా బుల్లెట్ దిగాల్సిందే..

  0
  8174

  యుద్ధంతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్ లోకి ఓ వ్యక్తి దిగేశాడు. అతడు అడుగు పెట్టడమే సినిమాల్లో హీరో అడుగు పెట్టిన స్థాయిలో వార్త అయింది. ఇంతకీ అతడెవరో తెలుసా..? అతడి పేరు వలి. ప్రపంచంలో సైన్యంలో లేకుండానే సైనికులకు సాయంగా పోయే ఒక సైనికుడు. పదవులు లేకుండానే, ప్రయోజనం ఆశించకుండానే సైన్యానికి ఉపయోగపడే ఒక ధీరుడు. ఒకప్పుడు కెనడాలోని 22-ఇ రాయల్ రెజిమెంట్ లో ఉండేవాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసినా.. అతని సేవల్ని సైన్యం కోరుతూనే ఉంటుంది.

   

  ఇంతకీ అతని స్పెషాలిటీ ఏంటో తెలుసా..? అతడు ప్రపంచ ప్రఖ్యాత స్నైపర్. మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా గురి తప్పకుండా పేలుస్తాడు. అదే వలి స్పెషాలిటీ. 2015లో ఇరాక్ పై పోరాటానికి వలిని ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. దానికి ముందు 2009-2011 మధ్య వలి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లపై గురిపెట్టాడు. ఆ తర్వాత సిరియాలో కూడా అతడి సేవలను వాడుకున్నారు. ఇప్పుడు వలి ఉక్రెయిన్ కు బయలుదేరాడు.

  ఒక సామాన్య పౌరుడుగా ఆయన ఉక్రెయిన్ దేశ ఆహ్వానంపై అక్కడ అడుగుపెట్టాడు. ఉక్రెయిన్ మిలట్రీ వాలంటీర్ల విభాగంలో పనిచేయబోతున్నాడు. బిడ్డ, భార్యను వదిలి ప్రాణాలకు తెగించి ఉక్రెయిన్ లో అడుగు పెట్టాడు. పిల్లవాడి మొదటి పుట్టినరోజు వేడుకలకు కూడా ఇంటి వద్ద ఉండకుండా యుద్ధరంగంలోకి వచ్చేశాడు వలీ. తన బిడ్డలాగే ఉక్రెయిన్ కూడా పసిబిడ్డలాంటిదని, అమాయక ఉక్రెయిన్ ని రష్యా హింసించడాన్ని తాను భరించలేక ఉక్రెయిన్ సైన్యానికి సాయపడేందుకు వచ్చానని చెప్పాడు.

  తనను ఉక్రెయిన్ సైనికులు చాలా ఘనంగా ఆహ్వానించారని రావడంతోనే ఒక యాంటి ట్యాంక్ మిసైల్ తో రెండు యుద్ధ ట్యాంకర్లను పేల్చేశానని చెప్పాడు. మానవతా దృక్పథంతోనే తాను ఉక్రెయిన్ సైనికులకు సాయంగా కెనడానుంచి వచ్చానని చెప్పాడు. ఒకవైపు పోలండ్ నుంచి ఉక్రెయిన్ శరణార్థులు వందలు, వేలు తరలిపోతుంటే వారికి ఎదురుగా పోలండ్ నుంచి వలి ఉక్రెయిన్ లోకి ప్రవేశించారు. ఇప్పుడు ఈ స్నైపర్ పూర్తి స్థాయి యుద్ధానికి ఉక్రెయిన్ తరపున సిద్ధమైపోయాడు.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..