ఓ మత్స్యకారుడికి నిద్ర లేచిన టైం బాగుంది. గంటలో అదృష్టం కలిసొచ్చింది. అరగంటలో మంచి చేప పడింది. 13 లక్షల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టింది ఆ మీనం. తెలియాబోలా అనే ఈ చేప.. పశ్చిమబెంగాల్‌లో దిగమోహన చాపల మార్కెట్‌లో వేలానికి వచ్చింది. 55 కిలోల ఈ చేపను కేజీ 25 వేల రూపాయలకు కొన్నారు.
పశ్చిమబెంగాల్ మిడ్నాపూర్ ప్రాంతంలో ఈ చేప వలకు చిక్కింది. తెలియాబోలా చేపకు మంచి డిమాండ్ ఉంది. ఈ చేప మొప్పలు అన్నవాహిక భాగాలకి విపరీతమైన డిమాండ్ ఉంది. దీన్ని చాలా రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ చేపలను ఎక్కువగా విదేశీ మందుల కంపెనీలు కొంటాయి. ఈ చేప కడుపులో ఉండే ఒక పదార్ధంతో తయారుచేసిన మందు నిత్యయవ్వనంగా ఉండేందుకు ఉపయోగపడేందుకు వినియోగిస్తారని చెప్తారు.
అందుకే ఈ చేపను అధిక మొత్తం వెచ్చింది కొనుగోలు చేస్తుంటారు. స్థానికంగా ఉండే దీన్ని కచ్చరబోలా అని కూడా అంటారు. దీని కడుపులో ఉన్న పదార్ధం, మొప్పలే ఎక్కువ ధర పలుకుతాయి. ఏడాదిలో ఒకటి, అరా మాత్రమే వలకు చిక్కుతాయి. ఏడాదిలో ఒక్కసారి ఈ చేప వలకు చిక్కినా.. ఆ మత్స్యకారుడి దశ తిరిగిపోతుంది.