ఈ స్పీడ్ బ్రేకర్ వేసిన ఇంజనీర్ కి నోబెల్ ?

  0
  2571

  ఇంజ‌నీర్ల అతితెలివో.. కాంట్రాక్ట‌ర్ల తెలివి త‌క్కువ త‌న‌మో తెలియ‌దు గానీ.. కొన్ని నిర్మాణ ప‌నులు చూస్తుంటే… తెలివి తెల్లారిన‌ట్లే ఉంటుంది. ఈ ఫోటో చూసినా అంతే. అతి వేగానికి అడ్డుక‌ట్ట‌గా రోడ్డు మీద స్పీడ్ బ్రేక‌ర్లు వేస్తుంటారు. అయితే అది ఎంత ఎత్తు, వెడ‌ల్పు, పొడ‌వు అనేది ఆ రోడ్డు ప‌రిమాణం బ‌ట్టి ఉంటుంది.

  ఇక్క‌డ చూడండి. ఎలాంటి స్పీడ్ బ్రేక‌ర్ వేశారో. ఈ స్పీడ్ బ్రేక‌ర్ దాటేందుకు కియా కారుకే సాధ్యం కాలేదంటే .. ఈ స్పీడ్ బ్రేక‌ర్ వేయించిన ఇంజ‌నీర్‌, చేసిన కాంట్రాక్ట‌ర్ ఎలాంటి చ‌దువ‌రులో అర్ధ‌మవుతుంది. ముందు టైర్ల‌కి, వెన‌క్కి టైర్ల మ‌ధ్య ఉండేంత స్పీడ్ బ్రేక‌ర్ వేయ‌డంతో .. పొర‌పాటున ఆ రోడ్డు మీద ఉన్న స్పీడ్ బ్రేక‌ర్‌ను దాటే ప్ర‌య‌త్నంలో కియా కార్ ఇలా.. ఇరుక్కుపోయింది.

  ఇలా ఇదొక్క‌టే కాదు… దేశంలో చాలా చోట్ల స్పీడ్ బ్రేక‌ర్ల ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ, సందుల్లో గొందులు మొద‌లు జాతీయ ర‌హ‌దారిపై కూడా ఇలాంటి స్పీడ్ బ్రేక‌ర్లు వంద‌ల సంఖ్య‌లో ఉన్నాయి. బ‌డి ద‌గ్గ‌ర‌, గుడి ద‌గ్గ‌ర‌, స్కూల్ ద‌గ్గ‌ర‌, హాస్పిట‌ల్ ద‌గ్గ‌ర‌, ఆఫీసుల ద‌గ్గ‌ర‌, దుకాణాల ద‌గ్గ‌ర‌.. ఇలా ఒక‌టా రెండా… ప్ర‌తిచోటా ఉన్నాయి. అవ‌స‌ర‌మైన చోట స్పీడ్ బ్రేక‌ర్లు ఉండాల్సిందే. దీన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. కానీ అన‌వ‌స‌ర‌మైన ప్రాంతాల్లోనూ స్పీడ్ బ్రేక‌ర్ల‌ను ఏర్పాటు చేసేస్తున్నారు. అయితే ఇవి ఎంత ప‌రిమాణంలో ఉండాలనేది ప‌క్క‌న పెట్టేసి… ఇష్టం వ‌చ్చిన సైజులో స్పీడ్ బ్రేక‌ర్లు పెట్టేస్తున్నారు.

  స్పీడ్ బ్రేక‌ర్లపైన మార్కింగులు కూడా ఉండ‌వు. బైక‌ర్లు, డ్రైవ‌ర్లు కొన్ని సార్లు ఈ స్పీడ్ బ్రేక‌ర్ల‌పై ప్ర‌యాణిస్తూ నియంత్ర‌ణ కోల్పోతున్నారు. కింద‌ప‌డి గాయాల‌పాల‌వుతున్నారు. ఇక చీక‌ట్లో ఇలాంటి స్పీడ్ బ్రేక‌ర్ల వ‌ల్ల ప్ర‌మాదాలు కూడా జ‌రుగుతున్నాయి. ఎందుకంటే ఇది కొన్ని ఎత్తుగా ఉండ‌డం, చాలా వెడ‌ల్పుగా ఉండ‌డం, ఉండాల్సిన ప‌రిమాణంలో లేక‌పోవ‌డం కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.