అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న చంద్రబాబు.

  0
  476

  టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీలోలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెందారు. చంద్రబాబు సతీమణిని వ్యక్తిగతంగా కించపరుస్తూ విమర్శలు చేయడంతో, చంద్రబాబు ఓర్చుకోలేక కంటతడి పెట్టారు. ఇంట్లో మహిళలను కూడా వదలకుండా వ్యక్తిగత దాడి చేయటంపై చంద్రబాబు ఆవేదన చెందారు. మళ్లీ గెలిచాకే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పారు. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తానని అన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. నేను ఎనిమిదోసారి ఎమ్మెల్యేగా ఉన్నాను . 1978 ఎంతోమంది ముఖ్యమంత్రులతో పనిచేశాను. ఎన్నో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నాం. తాను పెద్ద మహానాయకులతో పని చేశానని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు చూడలేదని చెప్పుకొచ్చారు. ఇన్ని సంవత్సరాలుగా ఏ పరువు కోసం పని చేశానో.. ఇన్నేళ్లుగా బతికామో.. నా కుటుంబం, నా భార్య విషయం కూడా తీసుకొచ్చి అవమానించారని అన్నారు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.