నా భార్య శీలాన్ని కించపరిచారు.. చంద్రబాబు.

  0
  1915

  నా భార్య శీలాన్ని కించపరిచారు.. ఇంట్లోఉన్న ఆమెను వీధిలో పెట్టారు. రాజకీయాల జోలికిరాని ఆమెను గురించి , ఆమె వ్యక్తిత్వాన్ని , శీలాన్ని తప్పుగా మాట్లాడారు. ఒకరికి సాయం చేయడంతప్ప , ఆమె ఎప్పుడూ తప్పుచేయలేదు.. అంటూ చంద్రబాబు నాయుడు , మీడియా మీట్ తో వెక్కివెక్కి ఏడ్చారు.. దాదాపు ఐదు నిముషాలు ఆయన చేతులు అడ్డంపెట్టుకొని ఏడుస్తూనే ఉన్నారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. నన్ను తిట్టారు, నా నాయకులను కేసుల్లో పెట్టారు. కార్యకర్తలను వేధించారు.. ఏడిపించారు.. ఆర్థికంగా దెబ్బకొట్టారు.. అయినా సహించాను , చివరకు , ఇళ్లలో ఆడవాళ్ళ శీలాన్ని కూడా బజారులో పెట్టారు.. అంటూ విలపించారు.. ఈ ప్రభుత్వం ఉన్నంతవరకు నేను అసెంబ్లీకి రాను , రాలేను అంటూ కన్నీళ్లుపెట్టుకుంటూ ముగించారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.