బదిలీపై వెళ్తూ ఎస్సై అందర్నీ ఏడ్పించాడు..

  0
  798

  బదిలీపై వెళ్తూ అందర్నీ ఏడ్పించాడు..
  సాధారణంగా పోలీసు ఉద్యోగులు బదిలీ అయితే కొంతమంది సంబరం చేసుకుంటారు, ఇంకొందరు పండగ చేసుకుంటారు. పోలీస్ స్టేషన్ స్థాయిలో ఎస్సై బదిలీ అయితో సిబ్బంది తప్ప ఎవరూ పట్టించుకోరు. పోయారులే అని సంతోషపడే కాలం ఇది. అయితే గుజరాత్ లో ఖేడ్ బ్రహ్మ టౌన్ ఎస్సై బదిలీ అయిపోతుంటే ఆ గ్రామమే కదలి వచ్చింది. చిన్నా, పెద్దా, ఆడా.. మగా.. అందరూ కూడా వేలమంది స్టేషన్ ముందు గుమికూడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయనకు వీడ్కోలు పలికారు. మహిళలు పూలు తెచ్చి ఆయనపై చల్లి కృతజ్ఞత తెలుపుకున్నారు. గ్రామస్తులంతా ఆయన పోయేంతవరకు అక్కడే ఉండి పేరు పేరునా ఆయన తమను విడిచిపోతుంటే కన్నీళ్లు పెట్టుకున్నారు. సాధారణంగా పోలీస్ శాఖలో బదిలీలు జరిగినప్పుడు ప్రజల్లో ఇంత స్పందన రాదు. కన్నీరు పెట్టుకునే పరిస్థితే ఉండదు. ఉన్నప్పుడు పోలీసులు కన్నీరు పెట్టిస్తారే తప్ప. పోయేటప్పుడు ప్రజలు ఇలా కన్నీరు పెట్టే పోలీస్ అధికారి బహుశా ఇతను ఒక్కడే కావొచ్చు. ఆ చిన్న పట్టణంలో శాంతి భద్రతలను పర్యవేక్షించడంతోపాటు కరోనా విజృంభించినప్పుడు తానే అందరికీ సేవలు చేసి, అందర్నీ మెప్పించి అందరి ఇళ్లకు వస్తువులు పంపించి ఆరోగ్యం బాగాలేనివారికోసం ప్రత్యేకంగా వైద్య బృందాలు ఏర్పాటు చేసి, అంబులెన్స్ లు ఏర్పాటు చేసి అసమానమైన సేవలు చేశారు. అందుకే ఆ ఎస్సై పోతుంటే అందరూ కన్నీరు పెట్టుకున్నారు. ప్రజల అభిమానం చూసి ఆయన కూడా కన్నీటితోనే ఆ స్టేషన్ నుంచి సాగిపోయాడు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.