పిల్లలను ఆటలు ఆడిస్తానని చెప్పి.. గదిలోకి పిలిచి

  0
  12650

  వాడో టీచర్. కామంతో కళ్లు మూసుకుపోయాయి. చిన్న పిల్లలని చూడకుండా వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాగుడు మూతలు ఆట పేరుతో నలుగురు బాలికలపై పాడుపని చేశాడు. చివరికి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం తమ్మారంలో ఘటన జరిగింది. ప్రైమరీ స్కూల్లో చదువుతున్న విద్యార్థినులపై ప్రిన్సిపల్ అనిల్ అఘాయిత్యం చేశాడని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

  ఏపీలోని విజయవాడకు చెందిన అనిల్… తమ్మారం స్కూళ్లో ఎనిమిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. గతేడాదే ఇతనికి పెళ్లయింది. మేళ్ల చెర్వులో ఉంటూ పాఠశాలకు వెళ్తున్నాడు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకున్న ఈ బడిలో 90మంది పిల్లలు చదువుతున్నారు. ఇతనితో పాటు మరొక టీచర్ మాత్రమే స్కూళ్లో పనిచేస్తున్నాడు. ప్రిన్సిపల్ అనిల్… రోజూ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య పిల్లలకు ఆటలు ఆడించి ఇంటికి పంపుతున్నాడు. ఆటల ముసుగులో చిన్నారులపై అఘాయిత్యం చేస్తున్నాడు. 10రోజులుగా 3, 4 తరగతుల చిన్నారులపై లైంగిక దాడి చేసినట్లు తేలింది. కొద్ది రోజులుగా చిన్నారులు స్కూలుకు వెళ్లేందుకు భయపడటంతో విషయం బయట పడింది.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు..