ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ కౌంట్ జీరో…

    0
    807

    పంచాయతీ ఎన్నికల్లో 4వేల సర్పంచ్ స్థానాలకు పైగా టీడీపీ గెలుచుకుందని చంద్రబాబు చెబుతున్నా.. వైసీపీ ఎమ్మెల్యేలు సర్పంచ్ లతో పెడుతున్న పరేడ్ లు ఆయన మాటలుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మా నియోజకవర్గంలో 100సీట్లుంటే ఇదిగో 90మంది సర్పంచ్ లు మా దగ్గరే ఉన్నరంటూ ఎమ్మెల్యేలు అందరినీ మీడియా ముందుకు తీసుకొస్తున్నారు. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో 90శాతం స్థానాలు వైసీపీకే దఖలు పడిన పరిస్థితి. ఆ లెక్కన చూస్తే.. ఇండిపెండెంట్లు మినహాయిస్తే 2వేల సీట్లు కూడా టీడీపీకి దక్కలేదని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు.

    ఇది మరో లెక్క..

    రాష్ట్రవ్యాప్తంగా 6 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి చుక్కలు చూపించారు. ఒక్కటంటే ఒక్క సర్పంచ్ సీటు కూడా దక్కకుండా వ్యూహాత్మకంగా అడుగులేశారు. నెల్లూరు రూరల్ సహా పుంగనూరు, మాచర్ల, పులివెందుల, జమ్మలమడుగు, అనంతపురం నియోజకవర్గాల్లో టీడీపీకి ఎంట్రీయే దక్కలేదు. వీటితోపాటు మరో 39 నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అయినట్టు తెలుస్తోంది. చంద్రబాబు పాత నియోజకవర్గం చంద్రగిరితోపాటు ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం కూడా ఈ లిస్ట్ లో ఉండటం విశేషం.

    వైసీపీ చెబుతున్న లెక్కలివీ..

    ఏపీలో నాలుగు విడతల్లో 13,081 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కేవలం 2,100 పంచాయతీల్లోనే టీడీపీ మద్దతుదారులు గెలిచారని, కేవలం 16 శాతం సీట్లే దక్కాయని అంటున్నారు. 41 శాతం పంచాయతీల్లో తాము గెలిచినట్లు ప్రకటించిన చంద్రబాబు 4,230 పంచాయతీలలో టీడీపీ బలపరచిన అభ్యర్థులు గెలిచారంటున్నారు. ఈ రెండు లెక్కల మధ్య పొంతన ఏమాత్రం లేకపోయినా.. వైసీపీ ఎమ్మెల్యేలు సర్పంచ్ లతో నిర్వహిస్తున్న పరేడ్ లు చూస్తే మాత్రం వైసీపీ లెక్క సరైనదేనని తెలుస్తోంది.

    ఇవీ చదవండి:

    అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

    ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

    ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?