హెలికాఫ్టర్ ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ , తర్వాత అయ్యో పాపం…

  0
  1247

  ఎంకి పెళ్లి ,సుబ్బి చావుకొచ్చిందన్నట్టు , వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల ఒకడు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఛతీస్ ఘడ్ లోని రాయపూర్ లో ఓ జంట పెళ్ళికి ముందు ఫొటో షూట్ చేసుకుంటుంది. పెళ్లికొడుక్కి , హెలికాఫ్టర్ పక్కన పెళ్లికూతురుతో నిలబడి ఫొటో దిగాలని కోరిక. అనుకున్నదే తడవుగా రాయపూర్ ఎయిర్ పోర్ట్ లో పనిచేసే కారు డ్రైవర్ ని అడిగాడు. మనోడు , అదెంతపని వచ్చెయ్ అన్నాడు.

  ఫొటోగ్రాఫర్ తో పెళ్ళికొడుకు , పెళ్లికూతురు ఎయిర్ పోర్ట్ లోకి పోయారు. అక్కడ నిలిపిఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికార హెలికాఫ్టర్ ముందు నిలబడి , లోపల కూర్చుని , ఫొటోలు దిగేశారు. ముచ్చటపడి సోషల్ మీడియాలో కూడా పెట్టేశారు. అధికారులు చూసి విచారణకు ఆదేశించారు. పోలీసు కేసునమోదు చేసి డ్రైవర్ ని సస్పెండ్ చేశారు. పెళ్ళికొడుకు , పెళ్లికూతురుపై కూడా కేసు నమోదు చేశారు..

   

  ఇవి కూడా చదవండి:

  మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

  ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

  బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?