టాటా అవిన్యా , కళ్ళు చెదిరే కారు.. త్వరలో..

  0
  415

  ఈ కారు చూసి ఇదేదో విదేశీ కారు అనుకోవద్దు.. మనదేశంలో ప్రముఖ మోటార్స్ సంస్థ టాటా మోటార్స్ తయారు చేసిన కారు మోడల్ ఇది.. టాటా అవిన్యా పేరుతొ మార్కెట్ లోకి రానున్న ఈ ఎలక్ట్రిక్ కారు డిజైన్ ను అధికారికంగా ఇప్పుడు ఆవిష్కరించింది . మూడోతరం మోడల్ అయిన ఈ ఎలక్ట్రిక్ ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 5 వందల కిలోమీటర్ల వరకూ పోతుంది .

   

  విదేశీ టెక్నాలజీని తలదన్నే విధంగా స్వదేశీ టెక్నాలజీతో విదేశీ మోడల్స్ ని మించి ఈ కారును డిజైన్ చేశారు . ఈ కారు 2025 లో మార్కెట్లోకి రానుంది . ఇది మార్కెట్లోకి వచ్చిన తర్వాత 30 శాతం మార్కెట్ ని , సొంతం చేసుకుంటుందని టాటా సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది . చాలా ఎలక్ట్రిక్ విదేశీ కార్ లలో ఉండే లోపాలు ఈ కారులో సరిదిద్దారు .

   

  దీన్ని కస్టమర్ ఫ్రెండ్లీగా తయారు చేశారు. ఈ కారుకి టాటా అవిన్యా అని పేరు పెట్టడంలోనే దీనికి ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఆకర్షణీయంగా ఉన్న ఈ కారు డిజైన్ దేశీయంగా మన రోడ్లపై పరుగులు తీసే విధంగా కూడా ఉంటుంది. ఇది డెలికేట్ గా కనిపించినా , మన దేశీయ పరిస్థితులకు అనుగుణంగా చేశామని తెలిపారు..వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో ‘అవిన్య’ రూపొందుతోంది. కారు లోప‌ల ఇంటీరియర్ ను చాలా అందంగా తీర్చిదిద్దింది. లోపల ఎంతో విశాలంగా కనిపిస్తున్న ఈ కారులో సైడ్‌ సీటింగ్‌, వినూత్నరీతిలో డోర్లను ఏర్పాటు చేసింది.

   

  బటర్ ఫ్లై డోర్లు అమ‌ర్చింది. వెనుక భాగాల్లో టీ-షేప్‌లో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లను అమర్చింది. అరగంటలోనే బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుంది. సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టమ్ దీని స్పెషాలిటీ. ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కి.మీ దూరం ప్రయాణించొచ్చు. దీని డిజైన్ కూడా చాలా స్మూత్‌గా ఉంది. డ్యాష్‌బోర్డ్ మొత్తం ప్లెయిన్‌గా ఉంటుంది. ‘మినిమైజ్ – మ్యాగ్జిమైజ్- ఆప్టిమైజ్’ అనే ఫార్ములాతో రేంజ్ ను అప్ గ్రేడ్ చేశారు. ‘అవిన్య’ సొంతం చేసుకోవాలంటే మాత్రం 2025 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.