పరాయివాడి మోజులో , భర్తమీద ద్వేషంతో…

    0
    6905

    చిత్తూరు జిల్లా,పుంగనూరు లో దారుణం జరిగింది. మానవసమాజమే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి.. పరాయివాడి మోజులో , భర్తమీద ద్వేషంతో ఓ తల్లి పసిబిడ్డను హింసిస్తూ 250 వీడియోలు తీసిన కర్కశ తల్లి ఉదంతమిది . ఈ నీచురాలు చిన్నారిని హింసిస్తూ 250 వీడియోలు తీసి భర్తకు పంపి రాక్షసానందం పొందింది. బిడ్డ ఏడుస్తున్నా , ఇంకా హింసిస్తూ , వీడియో తీసి పంపేది. చిన్నారి ప్రాధేయపడుతున్నా కనికరించకుండా హింసిస్తూనే ఉంది. ఈ పాశవిక ఘటన తమిళనాడులోని విల్లిపురం జిల్లాలో జరిగింది.ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉండగా పరారీలో ఉన్న తల్లి తులసి కోసం పోలీసులు గాలిస్తున్నారు.కాగా ఆమెది చిత్తూరుజిల్లా పుంగనూరు లోని రాంపల్లికి చెందినట్లు గుర్తించారు. విల్లిపురం జిల్లాలోని సత్యమంగళం మెట్టూరు గ్రామానికి చెందిన వడివేలన్ చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులసిని ఏడు ఏళ్ల క్రితం పెళ్ళి చేసుకున్నాడు.

    వీరికి గోకుల్ (4) ప్రదీప్ (2) అనే పిల్లలు కలిగారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు వస్తూ ఉండేవి. ప్రియుడు పై మోజుతోనే భార్య తులసి ఇలా చేసిందని అనుమానం. తులసి మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించిన తన భర్త ఎన్నో సార్లు మందలించినా వినకపోవడంతో మనస్పర్థలు ఏర్పడి విడివిడిగా ఉన్నారు.ఈ క్రమంలో ప్రియుడి మోజులో కడుపున పుట్టిన బిడ్డను చిత్రహింసలు పెడుతూ తండ్రికి పంపి క్రూరత్వాన్ని బయట పెడుతున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇటువంటి కర్కశ తల్లిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. చివరకు తమిళనాడునుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు కీచక తల్లి ని రాంపల్లిలో అరెస్ట్ చేసారు. బాలుడి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో , హాస్పిటల్ కి తరలించారు..

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్