ఉక్రెయిన్ యుద్ధంలో తమిళనాడు యువకుడు.. షాక్ తిన్న కేంద్రం.

    0
    990

    ఒక భారతీయుడు , తమిళనాడుకు చెందిన ఓ యువకుడు ఉక్రెయిన్ సైన్యంలో , ఇప్పుడు యుద్ధరంగంలో పోరాటంచేస్తున్నాడని మీకు తెలుసా.. ? నమ్మలేని ఈ నిజం చూడండి.. తమిళనాడు లోని కోయంబత్తూరుకు చెందిన , సైనికేష్ రవిచంద్రన్.. సైన్యంలో చేరాలని ఉబలాటపడేవాడు. ప్లస్ 2 అయిపోయిన తరువాత రెండు దఫాలు సైన్యంలో చేరాలని ప్రయత్నంచేసాడు.. సెలెక్ట్ కాలేదు. దీంతో 2020లో ఉక్రెయిన్ లో ఏరో స్పేస్ ఇంజినీరింగ్ లో చేరాడు. వచ్చే ఏడాది కోర్సు పూర్తికానుంది.

    యుద్ధం మొదలు కాకముందునుంచి , తల్లితండ్రులు ఇంటికి వచ్చేయమని కోరినా రాలేదు. యుద్ధం వస్తోందని , అందువల్ల తానుకూడా యుద్ధంలో పాల్గొంటానని , ఇంటికి రానని చెప్పేసాడు. చివరకు వారం క్రితం , పారామిలిటరీ సైనికుడిగా తుపాకిపట్టి యుద్ధంలో పాల్గొంటున్నాడు. తనకు ఇష్టమైన పనిచేస్తున్నానని తల్లితండ్రులకు చెప్పాడు. భారతీయుడు ఒకరు , ఉక్రెయిన్ సైన్యంలో ఉన్నాడని టెల్తెలిసి , మన దేశ ఇంటెలిజెన్స్ అధికారులు , , సైనికేష్ రవిచంద్రన్ ఇంటికిపోయి నిజాలు కనుగొన్నారు. , సైనికేష్ రవిచంద్రన్ ఇంట్లో గోడలకు , ప్రపంచంలోని అన్నిదేశాల సైనికుల ఫొటోలు ఉన్నాయి..

     

    ఇవీ చదవండి… 

    బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

    మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

    నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

    తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..