తెలంగాణలో పాము మాట్లాడిందా?

    0
    164

    తెలంగాణలో పాము మాట్లాడిందంటూ సోషల్ మీడియా హోరెత్తింది. అంతే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పాము మాట్లాడింది, వినండి అంటూ బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడం, ఆ వీడియోని హైలెట్ చేయడం అన్నీ జరిగాయి. తీరా చూస్తే ఆపాము అసలు కథ వేరే ఉంది.

    ప్రచారం ఎలా మొదలైంది..
    కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో పాము అరుస్తున్నదంటూ ఓ యువకుడు వీడియోను స్థానిక సోషల్‌ మీడియా గ్రూపుల్లో పోస్టు చేశాడు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆదివారం కొన్ని న్యూస్‌ చానళ్లు సైతం వెలిచాలలో అరిచే పాము సంచరిస్తున్నట్టు ప్రసారం చేశాయి.

    అసలు నిజం ఏంటి..?
    వెలిచాలలో అరిచే పాము సంచరిస్తున్నట్టు పలు టీవీ చానళ్లలో ప్రసారం కావడంపై స్థానిక ఎస్సై తాండ్ర వివేక్‌ స్పందించారు. ఇదంతా అబద్ధమని పేర్కొన్నారు. విదేశాలకు చెందిన మైక్‌ మార్టిన్‌ అనే వ్యక్తి మే 5న ‘హోంగోస్‌ హిట్స్‌ ద హై నోట్స్‌’ అనే పేరుతో సింగింగ్‌ స్నేక్‌కు సంబంధించిన 18 సెకండ్ల నిడివి కలిగిన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసినట్టు ఎస్సై తెలిపారు. ఆ వీడియోను వెలిచాలదిగా పేర్కొంటూ ఆకతాయి యువకుడు స్థానిక సామాజిక మాధ్యమ గ్రూపుల్లో తప్పుడు వార్తను పోస్టు చేయడం ద్వారా ప్రజల్లో అలజడి నెలకొన్నదన్నారు. సోమవారం సదరు యువకుడిని విచారిస్తామని ఎస్సై తెలిపారు.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..