లక్షల్లో ధర – క్రోకర్ ఫిష్ తో ఏం చేస్తారు?

  0
  565

  క్రోకర్ చేప కిలో 7 లక్షలు. ఒక చేప ఇంత ధర పోతుందా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ బాగా పెరిగిన క్రోకర్ చేప ఒక్కటి దొరికితే చాలు లక్షలు సంపాదించొచ్చు. దాదాపు 30నుంచి 50కేజీల వరకు క్రోకర్ చేప దొరికిందంటే ఒక్కోటి 10నుంచి 12 లక్షల రూపాయల రేటు పోతుంది. క్రోకర్ చేపను మన దేశంలో అయితే గోల్ చేప అంటారు. ఇంతకీ ఈ క్రోకర్ చేప ఇంత ధర పలికేందుకు కారణం, దీనిలో ఉండే గాలి బుడగలు. వైద్య పరికరాల తయారీలో అతి ముఖ్యమైన వస్తువుగా దీన్ని ఉపయోగిస్తారు.

  గుండె ఆపరేషన్లు, లివర్, కిడ్నీ ఇలాంటి ఆపరేషన్లు చేసే సమయంలో శరీరం లోపలి భాగంలో వేసే కుట్లు కి సంబంధించిన దారాన్ని క్రోకర్ ఫిష్ లోని ఈ గాలి బుడగలనుంచి తయారు చేస్తారు. అందుకే క్రోకర్ చేపకి లక్షల్లో విలువ కడతారు. చేప ఎంత పెద్దదిగా ఉంటే, దానిలో గాలి బుడగలు అంత పెద్దవిగా ఉంటాయి. ఈ గాలి బుడగల సాయంతోనే చేప నీళ్లలో ఈదగలుగుతుంది. చేపను కొన్న తర్వాత ఆ గాలిబుడగలను తీసేసి వాటిని, ప్రాసెస్ చేసి, శరీరం లోపలి భాగాల్లో వేసే కుట్లకి సంబంధించిన ఆపరేషన్ దారాలు తయారు చేసేందుకు వీటిని వినియోగిస్తారు. అంతే తప్ప తినడం కోసమే ఈ చేపకు అంత ధర ఇవ్వరు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..