ఎవరీ స్వారీ చేసే ఫుడ్ డెలివరీ బాయ్..

  0
  851

  ఏదైనా ఫుడ్ ఐటెం స్విగ్గీలో ఆర్డర్ చేస్తే మనకు తెలిసినంతవరకు బైక్ పైనే వస్తారు.. అయితే గుర్రంపై వచ్చి ఫుడ్ డెలివరీ చేయడం ఎప్పుడైనా చూశారా..? ఎప్పుడైనా విన్నారా ..? లేనేలేదు.. అయితే ముంబైలో ఓ వ్యక్తి తెల్ల గుర్రంపై . స్విగ్గీ లోగోతో ఉన్న బ్యాగ్ ను భుజాలకు తగిలించుకుని , వానలో కూడా ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. అయితే స్విగ్గి బ్యాగ్ ఉన్నప్పటికీ ఈ రకమైన హార్స్ డెలివరీ స్విగ్గిలో లేదు.. ఆర్డర్ల డెలివరీకి ఈ వ్యక్తి గుర్రాన్ని ఎలా ఎంపిక చేసుకున్నాడన్నదే ఎక్కువ మందికి వచ్చిన అనుమానం.

  ఇతడికి వచ్చిన ఐడియాకి ఆశ్చర్యపోతున్నారు. ఈ సంఘటనపై పెద్ద ఎత్తున నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో స్విగ్గీ కూడా రంగంలోకి దిగక తప్పలేదు. గుర్రంపై వెళుతున్న వ్యక్తి వివరాలు తమకు తెలియజేస్తే.. వారి స్విగ్గీ ఖాతాలో రూ.5,000 జమ చేస్తామంటూ ప్రకటించింది. ‘‘మా మోనోగ్రామ్డ్ డెలివరీ బ్యాగ్ తగిలించుకున్న గుర్తు తెలియని వ్యక్తి తెల్లటి గుర్రంపై కూర్చుని వెళుతున్న వీడియో మా దృష్టికి వచ్చింది.

  ఆ వ్యక్తి సొంత ఆలోచన, వాహనం ఎంపికను మేము అభినందించాలని అనుకుంటున్నాం. మీ మాదిరే మేము కూడా ఆ వ్యక్తి ఎవరో గుర్తించలేకున్నాం’’ అంటూ స్విగ్గీ ప్రకటన విడుదల చేసింది. ‘‘దయచేసి ముందుకు రండి. ఉత్తమ భారత పౌరుడిగా మీ వంతు సహకారం అందించండి. ఎందుకంటే గుర్రంపై ఉన్న స్విగ్గీమ్యాన్ ఎవరో దేశం తెలుసుకోవాలని అనుకుంటోంది’’ అని పేర్కొంది..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.