కరెంట్ బిల్లు కట్టలేదని మెసేజ్ ? జాగ్రత్త.

    0
    225

    మీరు కరెంట్ బిల్లు కట్టలేదని , మీకు ఎస్సెమ్మెస్ వస్తోందా..? అయితే జాగ్రత్త.. తొందరపడి ఆ ఎస్సెమ్మెస్ లింక్ ఓపెన్ చెయ్యొద్దు.. అలా చేశారా , మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఖాళీ అయిపోతాయి. .. ఇది నిజం, సైబర్ నేరగాళ్ల సరికొత్త హైటెక్ మోసం ..జాగ్రత్తగా ఉండండి. విద్యుత్‌ బిల్లుల బకాయి ఉన్నాయని , వాటిని చెల్లింపు చేయకపోతే , కరెంట్ కట్ చేస్తామని మెసేజ్ వస్తుంది. సహజంగా , కరెంట్ కట్ అంటే ఆందోళన చెందుతారు. ఎస్‌ఎంఎస్‌లు తో పాటు , ఫోన్‌ కాల్స్‌ కూడా చేస్తూ ఓ ముఠా కొత్తరకం మోసానికి పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ చెన్నై పోలీస్ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

    విద్యుత్‌ వినియోగదారులకు ఇటీవల కాలంలో ఎస్‌ఎంఎస్‌ రూపంలో, ఫోన్‌ కాల్‌ రూపంలో విద్యుత్‌ బిల్లుల చెల్లింపు కోసం సమాచారం వస్తోందని ఇందులో వివరించారు.వీటిలో గత నెల బిల్లులు అప్‌ డేట్‌ చేయలేదని, గడవు తేదీ ముగిసిన దృష్ట్యా, త్వరితగతిన చెల్లించాలని లేని పక్షంలో విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేస్తామన్న హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమాచారంతో విద్యుత్‌ బోర్డు పేరిట లింక్‌లు పంపిస్తున్నారని తెలిపారు. ఆ లింక్‌లు తెరవగానే, వినియోగ దారుల బ్యాంక్‌ ఖాతాల్లో నగదు మాయం అవుతోందని పేర్కొన్నారు.

    ఆన్‌లైన్‌ ద్వారా ఈ మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని ఆయన పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపునకు సంబంధించి విద్యుత్‌ బోర్డు ఎలాంటి ఎస్‌ఎంఎస్‌లు పంపించడం లేదని, ఫోన్‌ కాల్‌ చేయడం లేదని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. సో , అందువల్ల తొందరపడి ఆ లింకులు ఓపెన్ చేసి , బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు పోగొట్టుకోకండి.. ఇలాంటి మోసాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందువల్ల అలాంటి ఎస్సెమ్మెస్ లకు స్పందిచకపోవడమే మంచిది..

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.