75 ఏళ్లలో మొదటి తగాదా.. తియ్యటి ముగింపు..

  0
  139

  75 ఏళ్ల వయసులో భార్యాభర్తలు తగాదా వేసుకుంటే ఎలా ఉంటుంది ..? ఎలా ఉంటుందో ఏమో గాని ఆ తగాదా ముదిరి పోలీస్ స్టేషన్ కి వస్తే ఎలా ఉంటుంది ..? పోలీసులు ఆ వృద్ధ దంపతులు పట్ల ఎలా స్పందిస్తారు ..?? తీవ్రమైన ఆవేశంలో ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటే విసిగిపోయారు.. ఇక లాభం లేదనుకుని మీరిద్దరూ విడాకులు తీసుకోండి బెదిరించారు. దీంతో ఆ వృద్ధ దంపతులు బాగా బాధపడిపోయాడు. తగాదా తీర్చమని మీదగ్గరకు వస్తే , విడాకులు తీసుకోమంటారా అని పోలీసులను నిలదీశారు. దీంతో 55 సంవత్సరాల దాంపత్య జీవితం పోలీస్ స్టేషన్ కు రావడానికి సిగ్గుపడుతున్నానని ఏదో ఆవేశంలో వచ్చేసామని చెప్పుకున్నారు .

  ఇద్దరిని పోలీసులు కూర్చోబెట్టి అసలు విషయం ఏమిటని ఆరా తీశారు. భార్య ఇష్టంగా చేసిన వంట , బాగాలేదని భర్త అన్నాడట .. అదీ గొడవ. దాంతో ఇద్దరి మధ్య గొడవ పోలీస్ స్టేషన్ వరకు చేరింది . ఇదంతా విని పోలీసులు నవ్వుకున్నారు. ఇంట్లో ఉద్రేకం పోలీసు స్టేషన్లో తగ్గిపోయింది. దీంతో పోలీసులు ఇద్దరికీ స్వీట్స్ తెప్పించి , ఒకరి నోట్లో మరొకరిచేత పెట్టించి నవ్వుకున్నారు.. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .. ఈ సంఘటన దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన , సమన్వయం , పవిత్రత ఎంత గొప్పదో తెలియజెప్పేందుకు ఈ సంఘటన ఒక నిదర్శనం..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.