కారు రంగు మారితే మీకు రంగు పడుద్ది..

    0
    1744

    బైకులన్నా.. కార్లన్నా ఇప్పటి కుర్రకారుకి చాలా సరదా.. కొత్త కొత్త బైకులను కొనడం.. వాటిపై మిత్రులతో కలిసి సరదాగా తిరగడం.. అందరూ చేసే పనే.. అయితే అక్కడి వరకూ బాగానే ఉన్నా కొందరు మాత్రం ఓవర్ యాక్షన్ చేసి.. లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసే యువకుడు తాజాగా ఇండోర్ పోలీసులకు చిక్కాడు.. దీంతో ఆ యువకుడికి తిక్క కుదిర్చారు పోలీసోళ్ళు.. ఇంతకీ ఆ విషయమేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..

    ఇండోర్ లో బాగా సంపన్న కుటుంబానికి చెందిన ఓ యువకుడు BMW కారు కొన్నాడు. కొన్నాళ్ళు తోటి కుర్రాళ్లతో కలిసి జోరుగా తిరిగాడు. అయితే ఇటీవల ఆ యువకుడికి ఓ ఆలోచన వచ్చింది. తన కారుకు రంగు మార్చాలని నిర్ణయించుకొని.. 50వేలు పెట్టి రంగులు మార్పించాడు. అలా రంగు మార్చిన కారులో దర్జాగా తిరుగుతూ.. టైం బాగోలేక పోలీసులకు చిక్కాడు. పోలీసులు రికార్డులు పరిశీలించగా.. కారుకు రంగులు మార్చినట్టు గుర్తించారు.

    దీంతో 25 వేల రూపాయల జరిమానా విధించారు. వెంటనే కారుకు ఒరిజినల్ రంగు వేయించాలని సూచించారు. మరోసారి ఇలాగే రంగులు మార్చినట్టు తెలిస్తే.. కారును సీజ్ చేస్తామని హెచ్చరించారు. వాహనాలకు రంగులు మార్చకూడదని ఒకవేళ మారిస్తే చట్టప్రకారం శిక్షార్హులవుతారని క్లాస్ కూడా పీకారు. సో.. ఇకపై మీ వాహనాలకు రంగులు మార్చే ఆలోచన ఏమైనా ఉంటే మానుకోండి..

     

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.