ప్రేమ, పెళ్లి, విఫలమై హిజ్రా ఆత్మహత్య..

  0
  420

  హిజ్రాలకూ మనసుంటుంది.. ప్రేమించిన వాడికోసం సర్వస్వం ధారబోసే త్యాగమే కాదు , మోసం చేసినప్పుడు , విరక్తితో చనిపోయేంత ప్రేమకూడా ఉంటుంది.. స్వప్న అనే ఈ హిజ్రా ప్రేమించి పెళ్లాడినవాడు , మోసం చేసి వెళ్లిపోయాడని ఆత్మహత్య చేసుకుంది.హైదరాబాద్ మీర్ పేటకు చెందిన స్వప్న అనే హిజ్రా , నల్గొండకు చెందిన నిశాంత్ తో ప్రేమలో పడింది.. నిశాంత్ బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. కొంతకాలం ఇద్దరూ కలిసి సహజీవనం తరువాత , నిశాంత్ , స్వప్న పెళ్లిచేసుకున్నారు.

  మూడునెలలు విడిగా ఇళ్లు తీసుకొని కాపురంపెట్టారు. ఈ లోగా , నిశాంత్ , తమ ఊర్లో , ఒక పూజ ఉందని తల్లి తండ్రులు రమ్మంటున్నారని వెళ్ళాడు. తిరిగిరాకపోగా , ఫోన్ కూడా తీయకపోవడంతో , స్వప్న , నేరుగా నిశాంత్ ఇంటికెళ్లింది. ఇల్లు తాళం వేసిఉంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు , నిశాంత్ ని , వాళ్ళ తలితండ్రులను పిలిపించారు. స్వప్న తో కాపురం చేయలేనని నిశాంత్ చెప్పాడు.. దీంతో ఆమె తన గదికెళ్లి , చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకుంది..పోలీసులు కేసు నమోదుచేశారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.