కారు నంబర్ ప్లేట్ కోసం 188 కోట్లు..

  0
  193

  పావ‌లా కోడికి అర్ధ రూపాయి మ‌సాలా అన్న చందంగా కోటీశ్వ‌రుల‌ తీరు ఉంటుంది. ల‌గ్జ‌రీ కారు ధ‌ర క‌న్నా.. ఎన్నో రెట్లు ఎక్కువ ధ‌ర‌తో నెంబ‌ర్ ప్లేట్లు సొంతం చేసుకుంటుంటారు. ఫ్యాన్సీ నెంబర్లు అంటే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నచ్చిన నెంబర్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడని సెల‌బ్రిటీలు ఎక్కువ మందే ఉంటారు. అలాంటి వారిని త‌ల‌ద‌న్నేలా అర‌బ్ కంట్రీస్ లో కుబేరులు త‌మ కార్ల రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్ల కోసం ఎంత ఖ‌ర్చు చేసి సొంతం చేసుకున్నారో తెలిస్తే… క‌ళ్ళు బైర్లు క‌మ్మేస్తాయి. వాటి ధ‌ర ఎంతో మీరే చూడండి…

   

  కారు నంబర్ ప్లేట్ కోసం 188 కోట్లు..

  =====================

  MM అనే అక్షరాలున్న ఈ నంబర్ ప్లేట్ ధర ఇప్పుడు 188 కోట్లు.. MM అంటే ఈ కారు ఓనర్ పేరు. అతడిపేరు మైకేల్ మోడికి , దీన్ని ఇప్పుడు వేలం కోసం NFT మార్కెట్ ప్లేస్ లో ఉంచారు..

   

  ఈ కారు నంబర్ ప్లేట్ కోసం 154 కోట్లు..
  ====================

  ఈ కారు నంబర్ ప్లేట్ 154 కోట్లు.. బ్రిటన్ కి చెందిన అఫ్జల్ ఖాన్ దీన్ని స్వంతం చేసుకున్నాడు. ప్రపంచంలో కూడా రెండో అతిఖరీదైన నంబర్ ప్లేట్. 2008లో ఇది అతడికి దక్కింది. దీని కోసం మరో ఇద్దరు పోటీ పడ్డారు, ఆ పోటీలో ఈ కారు నంబర్ ప్లేట్ 154 కోట్లు అఫర్ పెట్టి అతడు దక్కించుకున్నాడు.. ఈ నంబర్ ప్లేట్ 114 ఏళ్ళ క్రితం వోల్వో కారుకు , ఎస్సెక్స్ నగర కౌంటీ చైర్మన్ తీసుకున్నాడు.. అదే ప్రతి వేలంలోనూ ధర పెరుగుతూ 154 కోట్లు పలికింది..

   

  ఈ కారు నంబర్ ప్లేట్ కోసం 154 కోట్లు

  ======================

  New York’ అనే నంబర్ ప్లేటున్న ఈ కారు 1970 నుంచి ఒకే కుటుంబంలో ఉంది.. వోల్వో – వి-70 కారుకున్న ఈ నంబర్ ప్లేటును డ్యూపాంట్ రిజిస్ట్రీ లో 154 కోట్లకు ఆఫర్ పెట్టారు..

   

  ఈ కారు నంబర్ ప్లేట్ కోసం 74 కోట్లు..
  =====================

  D Dubai-5 అనే నెంబ‌ర్ గ‌ల ఈ కారు నెంబ‌ర్ ప్లేట్ విలువ 74 కోట్లు. 2016లో బ‌ల్వీంద‌ర్ సాహ్ని ఇత‌డిని అబు స‌భా అని కూడా అంటారు. దుబాయ్‌లో ఉన్న ఈ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి… D -5 త‌న రోల్స్ రాయిస్ కారు కోసం వేలంలో ఈ నెంబ‌ర్ సొంతం చేసుకున్నాడు.

   

  ఈ కారు నంబర్ ప్లేట్ కోసం 74 కోట్లు..

  ===================

  ఇటీవ‌ల దుబాయ్‌లో కారు నెంబ‌ర్ల వేలంలో AA 8 నెంబ‌రును 72 కోట్ల‌కు వేలంలో ద‌క్కించుకున్నాడు.

   

  ఈ కారు నంబర్ ప్లేట్ కోసం 72 కోట్లు
  ================

  2008లో స‌య్య‌ద్ అబ్దుల్ గ‌ఫూర్ కౌరీ అనే ఈ గ‌ల్ఫ్ వ్యాపారి 1 నెంబ‌రును 73 కోట్ల‌కు ద‌క్కించుకున్నాడు.

   

   

  ఈ కారు నంబర్ ప్లేట్ కోసం 51కోట్లు
  ================

  బ‌ల్వీంద‌ర్ సాహ్ని మ‌రో కారుకు 51 కోట్లు చెల్లించి 09 నెంబ‌రును దుబాయ్‌లో ద‌క్కించుకున్నాడు.

  ఈ కారు నంబర్ ప్లేట్ కోసం 30 కోట్లు

  ======================

  అర‌బ్ దేశాల్లోనే మ‌రో వ్యాపారి I 7 నెంబ‌ర్ ను 30 కోట్ల‌కు ద‌క్కించుకున్నాడు.

  ఈ కారు నంబర్ ప్లేట్ కోసం 20 కోట్లు

  =================

  అర‌బ్ కే చెందిన మ‌రో వ్యాపారి అల్ మ‌జ్జోగి 2 నెంబ‌రును 20 కోట్ల‌కు చెల్లించుకున్నాడు. 2 కి ముందు I అక్ష‌రం ఉంటుంది.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..