భర్తను క్రూరంగా వేధించే నీకు పెళ్ళెందుకు ..?

    0
    392

    20ఏళ్లుగా భర్తను తీవ్రమైన మానసిక వేధింపులకు గురి చేసి, చిత్రహింసలు పెట్టిన భార్యకు సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధి చెప్పింది. ఆమె వాదనతో సంబంధం లేకుండా భర్తకు విడాకులు ఇచ్చేసి తీర్పు చెప్పింది. ఈమేరకు కింది కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సమర్థించింది. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, హృషికేష్ రాయ్ బెంచ్ ఈ కేసుపై తీవ్రంగా స్పందింది.

    20ఏళ్లుగా భర్తతో కాపురం చేయకుండానే విడిగా ఉంటూ, పిశాచిలాగా భర్తను వెంటాడటం, వేటాడటం ఎంతవరకు న్యాయం అని మందలించింది. పెళ్లయిన 6 నెలలకే భర్తను వదిలేసినప్పుడు 10ఏళ్లుగా వివాహ సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలని భర్త చేసిన ప్రయత్నాన్ని ఆమె తిరస్కరించిందని, అటువంటప్పుడు విడాకులు తీసుకోకుండా భర్త రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదని కోర్టు అభిప్రాయ పడింది.

    కాపురం చేయనప్పుడు విడాకులు ఇవ్వాల్సిందేనని దీనికి ఎటువంటి మినహాయింపు ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 142 ప్రకారం అసాధారణ రీతిలోనే తాము ఈ ఆదేశాలు జారీ చేస్తున్నామని, ఆమె తన భర్త చిత్రహింసలు పెట్టారన్న వాదన పూర్తిగా అబద్ధమని, ఇందుకు సాక్ష్యాధారాలు లేకపోగా, ఆమె భర్తను ఎలా వేధించిందో సాక్ష్యాలు ఉన్నాయని చెప్పింది.

    భర్త పనిచేసే సంస్థలకు, భర్తమీద ఫిర్యాదులు చేయడం, పోలీస్ స్టేషన్లో పదే పదే తప్పుడు కేసులు పెట్టడాన్ని కోర్టు ఎత్తి చూపింది. 20 ఏళ్లుగా కాపురం చేయని పరిస్థితుల్లో భర్త ఎలా వేధిస్తాడని, ఆయన పనిచేసే సంస్థలకు పిటిషన్లు పెట్టడం, అతనిమీద దుష్ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం, ఆ భార్య కిరాతక మనస్తత్వానికి నిదర్శనం అని పేర్కొంది. ఈ కేసు విషయంలో భార్య, తన భర్త పట్ల క్రూరంగా వ్యవహరించిందని కూడా కోర్టు అభిప్రాయ పడింది. ఆ భార్యా భర్త ఇద్దరూ చెన్నైకి చెందినవారు.

    ఇవీ చదవండి..

    మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

    25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్